శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2016 (10:05 IST)

పీఎస్ఎల్‌వీ సీ-35 ప్రయోగం సక్సెస్... 8 శాటిలైట్లు దిగ్విజయంగా నింగిలోకి...

పీఎస్ఎల్‌వీ సీ-35 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా ఎనిమిది శాటిలైట్లను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నింగిలోకి విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్

పీఎస్ఎల్‌వీ సీ-35 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా ఎనిమిది శాటిలైట్లను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నింగిలోకి విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. శనివారం సరిగ్గా ఉదయం 9.12 గంటలకు ఇగ్నిషన్ ఇవ్వగా, ఆపై నెమ్మదిగా లేచిన రాకెట్, క్షణాల్లో వేగం పుంజుకొని నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్లో ఎనిమిది ఉపగ్రహాలు ఉండగా, వాటిల్లో ఇస్రోకు చెందిన స్కాట్‌ సాట్ - 1తోపాటు అమెరికా, అల్జీరియా, కెనడా దేశాలకు చెందిన 5 ఉపగ్రహాలు, విద్యార్థులు శ్రమించి రూపొందించిన 2 ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు. 
 
వీటి మొత్తం బరువు 675 కిలోలు. శాటిలైట్లు పనిచేయడం ప్రారంభిస్తే, దేశంలో పెను తుఫానులు, సునామీల ముప్పును ముందుగానే అంచనా వేసే సాంకేతిక సామర్థ్యం భారత్ సొంతమవుతుంది. 2017లో అంగారక గ్రహానికి సంబంధించి కీలక ప్రయోగాలకు ఇస్రో ప్రణాళికలు వేసిన నేపథ్యంలో ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశానికి గర్వకారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీలు హర్షం వ్యక్తం చేస్తూ.. శాస్త్రవేత్తలను అభినందించారు.