బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 మే 2016 (12:38 IST)

ఒకేసారి 22 ఉపగ్రహాల ప్రయోగం... జూన్‌లో ఇస్రో ముహూర్తం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. జూన్ నెలాఖరులో ఒకేసారి 22 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్టు ఇస్రో ఛైర్మన్ కిరణ్‌ కుమార్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని విజయవంతంగా పరీక్షించిన తర్వాత తమ తదుపరి ప్రయోగం వచ్చే నెలలో 22వ తేదీ ఉపగ్రహాలను ఏకకాలంలో అంతరక్షింలోకి పంపడమేనని వెల్లడించారు. ఇస్రోకు చెందిన పోలార్ రాకెట్ పీఎస్‌ఎల్‌వీ సీ34ను ఇందుకు ఉపయోగించనున్నట్టు తెలిపారు. 
 
తాము ప్రయోగించే వాటిలో అమెరికా, కెనడా, ఇండొనేషియా, జర్మనీకి చెందిన ఉపగ్రహాలు కూడా ఉంటాయన్నారు. కాగా, గతంలో ఇస్రో 2008లో ఒకేసారి 10 ఉపగ్రహాలను ప్రయోగించి విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఉపగ్రహాల ప్రయోగం తర్వాత స్కాటరోమీటర్‌ను తదనంతరం ఇన్‌శాట్ 3డీఆర్‌ను ప్రయోగిస్తామని తెలిపారు.