గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (11:38 IST)

వైద్య వృత్తికే మచ్చ... అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ పట్టుబడిన డాక్టర్

వైద్య వృత్తికే మచ్చ తెచ్చాడో వైద్యుడు. వైద్యం చేయాల్సిన డాక్టరు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ వచ్చాడు. ఈ విషయం పసిగట్టిన పోలీసులు.. ఈ వ్యభిచార గుట్టును బహిర్గతం చేశాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ న

వైద్య వృత్తికే మచ్చ తెచ్చాడో వైద్యుడు. వైద్యం చేయాల్సిన డాక్టరు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ వచ్చాడు. ఈ విషయం పసిగట్టిన పోలీసులు.. ఈ వ్యభిచార గుట్టును బహిర్గతం చేశాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
గుజరాత్ రాష్ట్రంలోని అమ్రెలీ జిల్లాకు చెందిన ఓ డాక్టరు నలుగురు అమ్మాయిలను జైపూర్ నగరానికి తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తూ వచ్చాడు. జైపూర్ నగరంలోని వైశాలీనగర్ ప్రాంతంలోని ఓ అపార్టుమెంటులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టు చప్పుడు కానివ్వకుండా వ్యభిచారం చేయిస్తూ వచ్చాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. 
 
దీంతో పోలీసులు విటుడి వేషంలో ఓ పోలీసు అధికారిని పంపించి డాక్టరుతోపాటు నలుగురు అమ్మాయిలను వలపన్ని పట్టుకున్నారు. జైపూర్ నగరంలో జరిగే వైద్య సదస్సులో పాల్గొనేందుకు జైపూర్ వచ్చానని వైద్యుడు చెపుతున్నాడు. జమ్మూ, కాశ్మీర్, ముంబై, ఉత్తరప్రదేశ్, జైపూర్ ప్రాంతాలకు చెందిన నలుగురు అమ్మాయిలపై పోలీసులు పిటా కింద కేసు నమోదు చేశారు.