శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (11:33 IST)

4 నెలల తర్వాత వడ్డీ రేట్లపై నోరు విప్పిన అరుణ్ జైట్లీ!

నరేంద్ర మోడీ సర్కారు పాలనా పగ్గాలు చేపట్టిన నాలుగు నెలల తర్వాత తొలిసారిగా అరుణ్ జైట్లీ వడ్డీ రేట్లపై నోరు విప్పారు. వడ్డీ రేట్లు తగ్గితేనే అభివృద్ధి సాధ్యపడుతుందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. 
 
ప్రస్తుతం అమలవుతున్న వడ్డీ రేట్లు అంత ప్రోత్సాహకరంగా లేవు. దీంతో ద్రవ్యోల్బణం కూడా స్థిరంగానే కొనసాగుతోంది. వడ్డీ రేట్లను మార్చాల్సిన అవసరం ఆసన్నమైందని జైట్లీ తెలిపారు. 
 
"రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను సుదీర్ఘకాలంగా మార్చకుండానే కాలం నెట్టుకొస్తోంది. వడ్డీ రేట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో రుణాలు తీసుకోవడంలో దేశ ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. వడ్డీ రేట్లు తగ్గితే రుణాలు తీసుకునేందుకు జనం ఆసక్తి చూపుతారు" జైట్లీ వెల్లడించారు.