శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 జనవరి 2017 (11:53 IST)

అడ్డుకుంటే సముద్రంలోకి దూకి సామూహిక ఆత్మహత్య చేసుకుంటాం : జల్లికట్టు ఆందోళనకారులు

నిన్నటిదాకా వరకు శాంతియుతంగా, అహింసాయుత మార్గంలో కొనసాగిన జల్లికట్టు ఆందోళనలు సోమవారం హింసకు దారితీసింది. జల్లికట్టు ఆందోళనకారులతో కొందరు విద్రోహశక్తులు చేతులు కలిపాయని పేర్కొంటూ పోలీసులు రంగంలోకి దిగ

నిన్నటిదాకా వరకు శాంతియుతంగా, అహింసాయుత మార్గంలో కొనసాగిన జల్లికట్టు ఆందోళనలు సోమవారం హింసకు దారితీసింది. జల్లికట్టు ఆందోళనకారులతో కొందరు విద్రోహశక్తులు చేతులు కలిపాయని పేర్కొంటూ పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో చెన్నై మెరీనా బీచ్ ఇప్పుడు బెదిరింపుల కేకలతో దద్ధరిల్లిపోతోంది. 
 
జల్లికట్టుపై ఆర్డినెన్స్‌ ఒక్కటే సరిపోదని, శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నవారిని  పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో అక్కడ కలకలం చెలరేగింది. ప్రభుత్వ ఆదేశాలమేరకు సోమవారం తెల్లవారుజామున భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు బీచ్‌ను ఖాళీచేయించే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు "మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాం.."అని బెదిరించారు. మూకుమ్మడిగా జాతీయగీతాన్ని ఆలపిస్తూ పోలీసులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయినాసరే పోలీసులు వెనక్కి తగ్గలేదు. ఒకవైపు బీచ్‌ను ఖాళీ చేయిస్తూనే, అటువైపునకు వచ్చే దారులన్నింటినీ మూసేశారు.
 
ఆందోళనలకు నేతృత్వ వహిస్తోన్న బృందం ఒకటి పోలీసులతో మాట్లాడుతూ చట్టాన్ని గౌరవిస్తామని, అయితే మధ్యాహ్నం దాకా నిరసనలకు అనుమతినివ్వాలని, ఆ తర్వాత స్వచ్ఛందంగా నిరసన విరమిస్తామని వేడుకున్నారు. కానీ అందుకు పోలీసులు అంగీకరించేదు. "మీ లక్ష్యం నెరవేరింది. జల్లికట్టుకై ఆర్డినెన్స్‌ వచ్చింది. ఆట కూడా మొదలైంది. కాబట్టి మీరు ఆందోళన విరమించి, వెళ్లిపోండి"అని హెచ్చరించారు.