గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (12:46 IST)

సేలంలో నక్కలతో జల్లికట్టు... రెండు రోజుల్లో జల్లికట్టుకు రంగం సిద్ధం..

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జల్లికట్టు క్రీడ నిర్వహించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జల్లికట్టు నిర్వహించేందుకు వీలుగా ఒక ఆర్

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జల్లికట్టు క్రీడ నిర్వహించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జల్లికట్టు నిర్వహించేందుకు వీలుగా ఒక ఆర్డినెన్స్ ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలిపారు. దాన్ని శుక్రవారం రోజు కేంద్ర ప్ర‌భుత్వానికి పంపామని అన్నారు. జల్లికట్టుపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని రెండు రోజుల్లో ఆర్డినెన్స్ జారీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
త‌మిళ ప్ర‌జ‌లు చేస్తోన్న ఆందోళ‌న‌ల‌ను వెంటనే విరమించాలని కోరారు. అయితే ఆర్డినెన్స్ జారీ అయ్యేంతవరకు జల్లికట్టుపై నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జ‌ల్లిక‌ట్టుకు మ‌ద్ద‌తుగా శుక్రవారం త‌మిళ‌నాడులో పెద్ద ఎత్తున‌ ఆందోళ‌న‌లు కొనసాగుతున్నాయి. మెరీనా బీచ్ వ‌ద్ద పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు నిర‌స‌న‌లో పాల్గొన్నారు.
 
ఇదిలా ఉంటే.. సేలం జిల్లాలో నక్కతో జల్లికట్టు పోటీలు నిర్వహించారు. ఓ వైపు జల్లికట్టు పోటీల కోసం విద్యార్థులు ఆందోళన ముమ్మరం చేసిన తరుణంలో, సేలంలో జరిగిన నక్కల జల్లికట్టు పోటీలను అటవీ శాఖ అధికారులు వీక్షించారు. ఈ పోటీల కోసం నక్కలు అవసరం కావడంతో వాటిని తెచ్చేందుకు అటవీ శాఖాధికారులు సైతం అనుమతిచ్చి అడవిలోకి పంపారు. ఆపై జల్లికట్టు తరహా పోటీలను నక్కలతో నిర్వహించారు. కానీ ఈ పోటీలకు అటవీ శాఖాధికారులు సైతం అనుమతి ఇవ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పోటీలు ముగిశాక నక్కలను బావిలో వదిలేసినట్లు అధికారులు చెప్పారు.