గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (15:05 IST)

పాకిస్థాన్‌కు కాశ్మీర్ సీఎం సీరియస్ వార్నింగ్: ఆ దేశం నుంచి మొత్తం ఆపేయండి..

పాకిస్థాన్‌కు జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. భారత్‌తో చర్చలు జరగాలంటే పాకిస్థాన్ ముందుగా టెర్రరిజాన్ని ఆపాలని సూచించారు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నంతకాలం పాకిస్థాన్‌త

పాకిస్థాన్‌కు జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. భారత్‌తో చర్చలు జరగాలంటే పాకిస్థాన్ ముందుగా టెర్రరిజాన్ని ఆపాలని సూచించారు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నంతకాలం పాకిస్థాన్‌తో చర్చలు సాధ్యం కావని ముఫ్తీ అభిప్రాయం వ్యక్తం చేశారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టం శాశ్వతం కాదని, జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొంటే దానిని ఎత్తివేస్తామని మెహబూబా వెల్లడించారు. రాళ్లు రువ్వాలంటూ రెచ్చగొట్టేవారితో అప్రమత్తంగా ఉండాలని ఆమె కాశ్మీర్ యువతకు పిలుపు నిచ్చారు. 
 
ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ నటీనటులపై నిషేధం విషయంలో ప్రభుత్వం కపటబుద్ధితో వ్యవహరిస్తోందని బాలీవుడ్ హీరో అభయ్ డియోల్ విమర్శించాడు. పాకిస్థాన్‌తో సంబంధాలు తెంచుకోవాలని భావిస్తే ఆ దేశానికి చెందిన అన్నిటిపైనా నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. 18వ జియో 'మామి' ఫిల్మ్ ఫెస్టివల్‌లో అతడు మాట్లాడుతూ... మిగతావి అన్ని వదిలేసి పాకిస్థాన్ కళాకారులపైనే ఆంక్షలు విధించడం సరికాదన్నాడు.
 
పాకిస్థాన్‌కు చెందిన వాటిని నిషేధించాలనుకుంటే అన్నిటిపైనా ఆంక్షలు విధించండి. ఒక్క సినిమాలనే నిషేధించడం సరికాదంటూ కామెంట్ చేశాడు. ఇంకా పొరుగు దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు కూడా ఆపేయాలని.. పాకిస్థాన్‌కు చెందిన వాటిపై నిషేధం వల్ల మన సైనికులకు మంచి జరుగుతుందనుకుంటే తాను తప్పకుండా సమర్థిస్తానని.. ఈ వివాదంపై అనవసరం రాద్ధాంతం చేయడం మంచిది కాదని డియో స్పష్టం చేశాడు.