Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లేచి నిలబడగానే బెల్ కొట్టేస్తే ఎట్టా మాట్లాడేది? కోడెలను నిలదీసిన కశ్మీర్ ఎమ్మెల్సీ

హైదరాబాద్, ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (02:26 IST)

Widgets Magazine
Pregnant Women

ఒకవైపు జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ప్రాంగణంలోకి ప్రవేశించకుండా ప్రతిపక్షనేత ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడమే కాకుండా, వైకాపా గిరిజన మహిళా ఎమ్మెల్యేలకు  కనీసం ఆహ్వానం పంపకుండా ఘోరంగా అవమానించిన ఏపీ స్పీకర్ శివప్రసాదరావుకు సదస్సు వేదికమీదే చుక్కెదురైంది. చట్టసభల్లో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏదైనా అంశంపై ప్రసంగించేందుకు నిలబడగానే స్పీకర్‌ బెల్‌ కొట్టేస్తారు. ఇక మేం ఏం మాట్లాడేది అంటూ జమ్మూ కశ్మీర్ ఎమ్మెల్సీ డాక్టర్ షెహనాజ్ ఏపీ స్పీకర్‌ని నిలదీశారు. చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులు మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వండి అంటూ ఆమె డిమాండ్ చేశారు. 
 
‘ఏపీ స్పీకర్‌ ఇదే వేదిక మీద ఉన్నారు. ఆయన నా మాటలు కాస్త ఆలకించాలి. ఆయనతోపాటు దేశంలోని అందరు స్పీకర్లకు నేను చెప్పేదొకటే. చట్టసభల్లో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏదైనా అంశంపై ప్రసంగించేందుకు నిలబడగానే స్పీకర్‌ బెల్‌ కొట్టేస్తారు. ఇక మేం ఏం మాట్లాడేది? మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ గొంతును ఎలా వినిపించాలి? చట్టసభల్లోనే మహిళలు మాట్లాడేందుకు అవకాశం లేకపోతే బయట ప్రపంచంలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. అందుకే చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులు మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వండి..’ అని జమ్మూకశ్మీర్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ షెహ్‌నాజ్‌ కోరారు. 
 
జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సు రెండోరోజు ఆమె మాట్లాడారు. చట్టసభల్లోనే కాకుండా అన్ని రంగాల్లో మహిళలు తమ స్వరాన్ని బలంగా వినిపించాల్సిన ఆవస్యకత ఉందన్నారు. ప్రపంచం మహిళల వాదన వినాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ మహిళలు తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందన్నారు.
 
జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు కాదు. తెలుగుదేశం ప్రభుత్వ కార్పొరేట్ మహిళా సదస్సు అంటూ వైకాపా ఎమ్మెల్యే తీవ్రంగా అధిక్షేపించిన నేపథ్యంలో ఏపీలోనే కాదు, ఆశేతు హిమాచలం మహిళా ప్రతినిధులు ఇదే పక్షపాతాన్ని, ఇదే నిర్లక్ష్యాన్ని ప్రభుత్వాల నుంచి ఎదుర్కొంటున్నారని తెలియడం విశేషం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అక్కడ మన్నార్ గుడి మాఫియా.. ఇక్కడ కుదురుపాకం మాఫియా.. కేసీఆర్‌కు ప్రాణహాని తప్పదా?

తెలంగాణలో మరో శశికళ వల్ల సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ప్రాణహాని ఉందంటూ కేసీఆర్ అన్న ...

news

కన్నీటి పర్యంతమైన వాంగ్ కీ: 54 ఏళ్ల తర్వాత చైనాలో తొలి అడుగు

దారి తప్పి చైనా సరిహద్దునుంచి భారత్ లోకి అడుగుపెట్టి ఇండియన్ ఆర్మీ చేతికి చిక్కిన ఆ చైనా ...

news

శశికళకు మరో షాక్... పన్నీర్ సెల్వం గూటికి మరో ఎంపీ... పెరుగుతున్న వలసలు

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరో షాక్ తగిలింది. అన్నాడీఎంకేకు చెందిన ...

news

కొరకరాని కొయ్యలా పన్నీర్ సెల్వం... శశికళ చేసిన తప్పులు ఇవే... ఆశలు గల్లంతే

నిన్నటివరకు తనకు వంగివంగి నమస్కారాలు చేసిన ఓ.పన్నీర్ సెల్వం ఇపుడు కొరకరాని కొయ్యలా ...

Widgets Magazine