శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 2 అక్టోబరు 2014 (19:59 IST)

నాకంటూ కుటుంబమే లేదు... అలాంటప్పుడు అక్రమాస్తులెందుకు... అమ్మ ప్రశ్న

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు హృదయాలను కదిలిస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన అనంతరం ఆమె న్యాయవాదులు, నిందితులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో చేసిన వ్యాఖ్యలను ఓ తమిళ పత్రిక ప్రకటించింది. అవేమంటే, "నేను స్వతహాగా ఆస్తిపరురాలిని. ఒక అగ్రశ్రేణి నటిగా ఎంతో డబ్బు సంపాదించాను, అంతేకాదు రాజకీయాల్లోకి రాకముందు నుంచే నా ఆస్తి చాలా ఉంది. 
 
ఐతే ఈ ఆస్తి అంతా ఆనాటి నుంచి ఈనాటి వరకూ అలాగే ఉంది. కానీ నాకంటూ ఓ కుటుంబమే లేనప్పుడు అక్రమంగా ఆర్జించాల్సిన అవసరం నాకేముంటుంది? నా ఆస్తి అంతా తమిళనాడు ప్రజలే. అందుకే నా యావదాస్తినంతా తమిళనాడు ప్రజలకే అంకితం చేస్తాను. నాతో ప్రజాకోర్టులో ఢీకొనలేని కొందరు వ్యక్తులు కుట్రపన్ని ఈ కోర్టుద్వారా అక్రమ కేసులను బనాయించి ప్రతీకారం తీర్చుకున్నారు" అని జయలలిత చెప్పారు.