శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 31 జులై 2014 (12:15 IST)

ఆమాత్రం దానికే జయ పరువు పోయిందా...? మరి ఎందుకలా...?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన సినిమా జీవితంతోపాటు రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ తమిళనాడు రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో అధికార పీఠంపై కూర్చున్న జయలలిత డీఎంకే పార్టీని భవిష్యత్తులో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్నట్లుగా అధఃపాతాళానికి తొక్కేశారని చెప్పుకుంటున్నారు. అంత లోతుగా తొక్కేసినప్పటికీ గతంలో అసెంబ్లీలో అవమానించిన డీఎంకే నాయకులను అంత సులభంగా ఆమె వదలదల్చుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
 
అసెంబ్లీలో డీఎంకే సభాపక్ష నాయకుడు ఎంకె స్టాలిన్‌పై అన్నాడీఎంకే అధినేత్రి, పురట్చితలైవి, తమిళనాడు సీఎం జయలలిత పరువునష్టం దావా వేశారు. అసెంబ్లీ వెలుపల తనకు, స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు తమిళనాడు సీఎం జయలలిత పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
 
ముఖ్యమంత్రి తరఫున నగర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంఎల్ జగన్ బుధవారం చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ ఏడాది జూలై 22న అసెంబ్లీ నుంచి స్టాలిన్‌తోపాటు ఇతర డిఎంకె ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి వెలుపలికి పంపించడం జరిగిందని సిపిపి తన పిటిషన్‌లో తెలిపారు.
 
అసెంబ్లీ వెలుపల విలేకరులతో మాట్లాడిన అనంతరం స్టాలిన్, ఇతర డిఎంకె ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రికి, స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.