శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (10:49 IST)

కరుణానిధిపై అమ్మ పరువు నష్టం దావా: మురసొలి, ఆనందవికడన్‌లపై కూడా?

తమిళనాడులో ఏడీఎంకే- డీఎంకేల మధ్య మళ్లీ వార్ ప్రారంభమైంది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిపై తమిళనాడు సీఎం జయలలిత పరువు నష్టం దావా వేశారు. తమిళ వార పత్రిక ఆనంద వికడన్‌లో నాలుగేళ్ల జయలలిత పరిపాలనపై ప్రచురించిన వార్తల ఆధారంగా డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి దినపత్రిక అయిన మురసొలిలో ఓ వ్యాసం రాశారు. 
 
ఈ వ్యాసం సీఎం పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వుందని ఆరోపిస్తూ.. ఆ పత్రిక సంపాదకుడు మురసొలి సెల్వం, కరుణానిధిపై క్రిమినల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. చెన్నై జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాది మంగళవారం ఈ పిటిషన్ దాఖలు చేశారు.

అలాగే సీఎం జయలలిత కీర్తిప్రతిష్టలను కించపరిచే విధంగా తీవ్రపదజాలంతో వ్యాసం ప్రచురించిన ఆనందవికడన్ సంపాదకులు, ప్రచురణ కర్తపై కూడా పరువునష్టం దావా దాఖలు చేశారు.