బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 3 అక్టోబరు 2016 (14:27 IST)

జయలలిత అనారోగ్యంపై పుకార్లు... గుండెపోటుతో 'అమ్మ' అభిమాని మృతి

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపైన రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఐతే ఇవన్నీ చెన్నైలో మౌత్ టాక్ ద్వారా వెళ్లిపోతున్నాయి. ఈ పుకార్లతో అమ్మ అభిమాని ఒకరు తీవ్ర ఆందోళనకు గురై గుండెపోటుతో మరణించాడు. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయానికి సమీపంలో ఉండే 47

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపైన రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఐతే ఇవన్నీ చెన్నైలో మౌత్ టాక్ ద్వారా వెళ్లిపోతున్నాయి. ఈ పుకార్లతో అమ్మ అభిమాని ఒకరు తీవ్ర ఆందోళనకు గురై గుండెపోటుతో మరణించాడు. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయానికి సమీపంలో ఉండే 47 ఏళ్ల ముత్తుస్వామి జయమ్మ అనారోగ్యంపై వస్తున్న పుకార్లను విని తట్టుకోలేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
 
మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పురిట్చితలైవి జయలలిత ఆసుపత్రిపాలై 10 రోజులు దాటిపోయింది. ఐతే ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ వార్తలయితే వస్తున్నాయి కానీ ఆమెకు సంబంధించిన ఫోటోలు మాత్రం ఒక్కటి కూడా బయటకు విడుదల కాలేదు. దీనిపై అన్నాడీఎంకె కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కార్యకర్తలు భారీగా చేరి అక్కడ నుంచి కదలడం లేదు. 
 
అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారు... మీరు వెళ్లమని చెపుతున్నా వాళ్లు వినడంలేదు. అమ్మను చూసిన తర్వాతే ఇక్కడ నుంచి వెళతామని అంటున్నారు. ఈ వ్యవహారం మాజీముఖ్యమంత్రి కరుణానిధి దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వం ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో తనకైతే అర్థం కావడంలేదన్నారు. ఆసుపత్రిలో జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేస్తే ఆమె కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు వారివారి ఇళ్లకు వెళతారు కదా. ఇప్పటికైనా 68 ఏళ్ల జయలలిత ఆరోగ్యాన్ని తెలుపుతూ ఫోటోలు విడుదల చేయాలని 92 ఏళ్ల కరుణానిధి డిమాండ్ చేస్తున్నారు.