గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Sellvi
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (00:16 IST)

జయమ్మ కోసం ప్రముఖుల ట్వీట్స్.. అపోలో వైపే అందరి దృష్టి.. భారీ బందోబస్తు.. చెన్నై బ్రేక్ డౌన్..

తమిళనాడు సీఎం జయలలిత గుండెపోటుకు గురైన నేపథ్యంలో ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. గుండెకు సంబంధించి ప్రత్యేక కృత్రిమ శ్వాస పరికరాలతో.. కార్డియాలజీలో నిపుణులైన వైద్యులు

తమిళనాడు సీఎం జయలలిత గుండెపోటుకు గురైన నేపథ్యంలో ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. గుండెకు సంబంధించి ప్రత్యేక కృత్రిమ శ్వాస పరికరాలతో.. కార్డియాలజీలో నిపుణులైన వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని అపోలో వైద్యులు చెప్పారు.

ఈ నేపథ్యంలో అపోలో హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మకు గుండెపోటు రావడంతో తమిళనాట అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద అభిమానులు అమ్మకు గుండెపోటు అనగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 
ఇదిలా ఉంటే.. అమ్మకు గుండెపోటు వార్త విన్న వెంటనే చెన్నై బ్రేక్ డౌన్ అయిపోయింది. ప్రజల నోట అమ్మ మాటే వినబడుతోంది. ఇకపోతే.. అపోలోలో అమ్మకు సెప్టెంబర్ నుంచి వైద్య సేవలు అందించిన ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు సోమవారం చెన్నైని వీడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు అమ్మ ఆరోగ్య పరిస్థితిపై వార్తలు విన్న ప్రముఖులు ట్విట్టర్లో ఆమె కోలుకోవాలని ఆశిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ అమ్మ త్వరలో కోలుకోవాలని ఆశిస్తున్నారు. 
 
భారీ భద్రతలో భాగంగా 9 రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లు ఇప్పటికే అపోలో వద్దకు చేరుకున్నాయి. తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ అపోలో చేరుకున్నారు. ఆమె ఆరోగ్యంపై వైద్యుల వద్ద ఆరా తీశారు. రాష్ట్ర పరిస్థితులపై దృష్టి పెట్టారు. అమ్మ త్వరలో కోలుకోవాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఆకాంక్షించారు. కాగా జయలలితకు గుండెపోటు వార్త వినగానే చెన్నైలోని పలు సినిమా హాల్స్ తమ షోలను రద్దు చేసుకున్నాయి.