శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 మార్చి 2017 (15:36 IST)

జయలలిత ఆత్మ తిరగాడుతుందా? TN07-V 1948 అనే పాత కారు చిత్తూరుకు ఎందుకొచ్చింది?

జయలలిత ఉపయోగించిన పాత కారును ఏపీలోని చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఎవరో వదిలి పారిపోయారని సమాచారం. చిత్తూరు జిల్లాలోని కేవీబీ పురం మండలంలోని ఆరోం గ్రామం సమీపంలోని నిర్జనప్రద

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణానికి అనంతరం అమ్మ ఆత్మ అపోలో ఆస్పత్రిలో తిరగాడిందని.. అంత్యక్రియలు జరుగుతుండగా మెరీనా తీరంలో కనిపించిందని జోరుగా ప్రచారం సాగింది. ప్రస్తుతం ఇదే తరహాలో కొత్త ప్రచారం జరుగుతోంది. అయితే అది తమిళనాట కాదు. ఆంధ్రప్రదేశ్‌లో. ఇందుకు కారణం అమ్మ పేరుతో రిజిస్టర్ అయిన కారు చిత్తూరు జిల్లాలోని నిర్జన ప్రాంతంలో కనిపించడమే. ఇంతకీ విషయం ఏమింటంటే? జయలలిత ఉపయోగించిన పాత కారును ఏపీలోని చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఎవరో వదిలి పారిపోయారని సమాచారం. 
 
చిత్తూరు జిల్లాలోని కేవీబీ పురం మండలంలోని ఆరోం గ్రామం సమీపంలోని నిర్జనప్రదేశంలో కారు నిలిపి ఉన్న విషయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక సబ్ ఇన్స్ పెక్టర్ పరుశురాముడు సంఘటనా స్థలానికి చేరుకుని కారులోని పత్రాలు పరిశీలించారు. టీఎన్ 07-వీ 1948 నెంబరు ఉన్న ఆ కారును తొలుత జయలలిత పేరుతో రిజిస్టర్ అయ్యిందని.. ఆపై ఇద్దరు చేతులకు ఆ కారు మారిందని తెలిసింది. 
 
అయితే తాజాగా ఆ కారు ఓనర్ ఎందుకలా ఆ కారును వదిలి పెట్టి వెళ్లిపోయాడో కారణం తెలియరాలేదని పరుశురామ్ చెప్పారు. దీనిపై విచారణ జరుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే స్థానికులు మాత్రం ఆ కారును అమ్మ జయలలిత ఆత్మ భయంతోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడని అనుకుంటున్నారు. కారు తనది కావడంతో అమ్మ ఆత్మ కారు ఓనర్‌ను భయపెట్టి వుంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంకేముంది? అమ్మ ఆత్మ ఈ విధంగా తమిళనాడు నుంచి చిత్తూరుకు వెళ్ళిందన్నమాట.