Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళకు తేరుకోలేని షాకిచ్చిన సుప్రీంకోర్టు... ఆ కేసులో వారం రోజుల్లో తుదితీర్పు

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (12:39 IST)

Widgets Magazine
sasikala

తమిళనాడు ముఖ్యమంతిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం చేత రాజీనామా చేయించి.. తాను సీఎం కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్ళూరుతున్న ముఖ్యమంత్రి దివగంత జయలలిత ప్రిచనెచ్చెలి శశికళ నటరాజన్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సోమవారం తేరుకోలేని షాకిచ్చింది. జయలలిత అక్రమాస్తుల కేసులో తుది తీర్పును వారం రోజుల్లో వెల్లడించనున్నట్టు సోమవారం తెలిపింది. ఇది శశికళకు శరాఘాతంగా మారింది. 
 
అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ జయలలితపై అవినీతి నిరోధక చట్టం కింద 1996లో కేసు నమోదైంది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 2014లో జయను దోషిగా పేర్కొంటూ నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెతో పాటు సహనిందితురాలిగా ఉన్న శశికళకు కూడా జైలు శిక్ష పడింది. అయితే, 2015లో కర్ణాటక హైకోర్టు జయలలితపై నమోదైన కేసును కొట్టేసి ఆమెకు విముక్తి కల్పించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసును విచారిస్తున్న అపెక్స్ కోర్టు.. తుది తీర్పును వారం రోజుల్లో వెల్లడించనున్నట్టు ప్రకటించింది. 
 
కాగా, ప్రత్యేక కోర్టు తీర్పుతో జయలలిత కొంతకాలం సీఎం పీఠానికి దూరమైనప్పటికీ... గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మళ్లీ అధికారం చేపట్టారు. జయ మరణంతో ఆమె దశాబ్దాలుగా కొనసాగిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ చేపట్టారు. దీనిపై కూడా ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఆమె లక్ష్యానికి అడ్డుతగిలేలా ఉన్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెలివైన జయమ్మకు ఓటేశాం.. నిశాని శశికళకు కాదు.. నెటిజన్ల కామెంట్స్

తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై నెటిజన్లు తమదైనశైలిలో ...

news

అపుడు అత్యాచారం చేశాడు.. ఇపుడు తాళి కట్టాడు...

అపుడు అత్యాచారం చేసిన నిందితుడే ఇపుడు జైల్లో తాళి కట్టాడు. ఈ వింత ఘటన ఒడిషా రాష్ట్రంలోని ...

news

ముస్లిం తీవ్రవాదుల వల్ల జరగరానిది జరిగితే ఆ న్యాయమూర్తిని బాధ్యుడిని చేయాలి : ట్రంప్ నిప్పులు

అమెరికా పౌరుల భద్రతను లక్ష్యంగా పెట్టుకుని ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో ...

news

డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన మరో న్యాయస్థానం... స్టే ఎత్తివేతకు ససేమిరా

అమెరికాలోకి ప్రవేశించకుండా ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధాజ్ఞలు విధించిన ఆ దేశ కొత్త ...

Widgets Magazine