Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జయమ్మ మృతి కేసు : చిన్నమ్మ శశికళకు సమన్లు

శుక్రవారం, 22 డిశెంబరు 2017 (14:54 IST)

Widgets Magazine
jayalaltihaa

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి కేసు విచారణ వేగవంతమైంది. ఇందులోభాగంగా, జయలలిత ప్రియనెచ్చెలి శశికళతో పాటు.. జయలలితకు చికిత్స చేసిన అపోలో ఆస్పత్రికి కోర్టు సమన్లు జారీచేసింది. నిర్ణీత గడువులోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో శశికళకు 15 రోజులు, అపోలో ఆసుపత్రికి 10 రోజుల గడువు విధించింది. 
 
జయలలిత అక్రమాస్తుల కేసులో రెండో ముద్దాయిగా ఉన్న శశికళ ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పణ అగ్రహారజైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే. అలాగే, జయ మృతిపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి జస్టీస్ ఆరుముగ స్వామి నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కమిటీ విచారణ జరుపుతోంది. 
 
ఈ నేపథ్యంలో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు... జయలలితకు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి కోర్టు సమన్లు జారీచేయడం గమనార్హం. మరోవైపు, ఆసుపత్రిలో ఫ్రూట్ జ్యూస్ తాగుతున్న జయలలిత వీడియోను దినకరన్ వర్గీయులు విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే. దీంతో జయలలిత మృతి కేసు సరికొత్త మలుపు తిరిగింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సర్.. నన్ను వదిలెయ్యండి... మోడీకి స్మృతి ఇరాని అభ్యర్థన.. ఎందుకు?

ప్రధానిజీ.. నాకు కేంద్రమంత్రిగానే బాగుంది. నేను ఈ పదవికి సరిగ్గా సరిపోతాను. నాకు ...

news

న్యాయవాది కాదు.. కామాంధుడు.. 15 యేళ్ల బాలికను పెళ్లాడాడు...

బాల్య వివాహాల అడ్డుకట్టకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నాయి. ...

news

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించే అభ్యర్థి ఎవరో తెలిస్తే షాకే?

జయలలిత మరణం తరువాత జరిగిన ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా ...

news

ఇక్కడ శత్రువు ఎక్కడో లేడంటున్న రాజమౌళి (వీడియో)

హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలపై ఓ అవగాహనా కార్యక్రమం ఇటీవల ...

Widgets Magazine