శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (05:43 IST)

జయలలిత చనిపోలేదట... చంపేశారట.. త్వరలోనే నిజాలు?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సహజంగా మృతి చెందలేదనీ, చంపేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని వెబ్‌సైట్లు, ఓ తమిళ టీవీ చానెల్ వార్తాకథనాలను కూడా ప్రసారం చేశాయి.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సహజంగా మృతి చెందలేదనీ, చంపేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని వెబ్‌సైట్లు, ఓ తమిళ టీవీ చానెల్ వార్తాకథనాలను కూడా ప్రసారం చేశాయి. ఈ వార్తలు నిజమేనని దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వంలో అత్యంత కీలంగా ఉన్న ఓ ఐఏఎస్ అధికారి చెపుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన ఇప్పటికే లీక్ చేసినప్పటికీ.. ఆ వార్తలను వేసేందుకు ఏ ఒక్క మీడియా సాహసం చేయలలేదనే ప్రచారం ఉంది. 
 
మరోవైపు... జయలలితకు చేసిన చికిత్స వివరాలను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని అపోలో ఆసుపత్రుల యాజమాన్యం సోమవారం మద్రాసు హైకోర్టుకు తెలిపింది. దీనిని సీల్డు కవరులో అందిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎస్‌.సుందర్‌లతో కూడిన మొదటి ధర్మాసనానికి ఆ ఆసుపత్రి తరపు న్యాయవాది విన్నవించారు. 
 
జయలలిత మరణంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై ఆ ధర్మాసనం విచారిస్తోంది. జయలలితకు అందించిన వైద్య సేవలపై ఆసుపత్రి వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చాయని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసు విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది.