గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (13:26 IST)

నిజం ఏంటో తెలియజేయండి.. శశికళ పుష్ప: పవన్ ప్రెస్‌మీట్ రద్దు ఎందుకు?

తమిళనాడు సీఎం జయమ్మ ఆరోగ్యంపై సస్పెన్స్ ఇంకా వీడట్లేదు. అమ్మకు యాంజియోగ్రామ్ చేయడంతో సేఫ్‌గా ఉన్నారని అపోలో వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో.. జయలలిత ఆరోగ్యంపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించాలని ఏఐడీఎ

తమిళనాడు సీఎం జయమ్మ ఆరోగ్యంపై సస్పెన్స్ ఇంకా వీడట్లేదు. అమ్మకు యాంజియోగ్రామ్ చేయడంతో సేఫ్‌గా ఉన్నారని అపోలో వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో.. జయలలిత ఆరోగ్యంపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించాలని ఏఐడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కోరారు. అమ్మ ఆరోగ్యంపై పార్టీ వర్గాలు చేస్తున్న ప్రకటనల్లో పారదర్శకత లేదని ఆమె అన్నారు. ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉందని శశికళ పుష్ప అభిప్రాయపడ్డారు.
 
జయలలిత ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న వదంతుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఉద్రిక్త పరిస్థితుల నుంచి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టాలని శశికళ పుష్ప కోరారు. రెండున్నర నెలలుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత పూర్తిగా కోలుకుందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన అనంతరం.. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఆమె ఆరోగ్యం మళ్లీ విషమించిందంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే.. గుండెపోటుకు గురైన తమిళనాడు సిఎం జయలలితకు సోమవారం ఉదయం గుండె ఆపరేషన్ జరిగిందని, ఆమె ఆరోగ్యం ఫైన్ అని డాక్టర్లు తెలిపినట్టు అన్నా డీఎంకె అధికార ప్రతినిధి సీఆర్. సరస్వతి ప్రకటించారు. అయితే అమ్మ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ చాలా విషమంగానే ఉందని అపోలో ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ఈ బులెటిన్‌ను విడుదల చేసింది.
 
ఇదిలా ఉంటే..  జనసేన అధినేత పవన్‌కల్యాణ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జనసేన సభ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సభకు సంబంధించి పవన్ కల్యాణ్ డిసెంబర్ 5న ప్రెస్ మీట్‌ నిర్వహించి మాట్లాడతారని పార్టీ వర్గాలు ఆదివారం ప్రకటించాయి. అయితే తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఈ పరిస్థితుల్లో ప్రెస్‌మీట్ నిర్వహించడం భావ్యం కాదని పవన్ భావించారు. దీంతో ప్రెస్‌మీట్‌ను రద్దు చేసినట్లు జనసేన పార్టీ వర్గాలు ప్రకటించాయి. జయ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని జనసేన ఆకాంక్షిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు.