శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 24 మే 2015 (17:38 IST)

సీఎంగా జయ బిజీ.. ఆదివారం కూడా సెలవు లేదు.. మరిన్ని అమ్మ క్యాంటిన్లు ప్రారంభం

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జయలలిత ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా బిజీ బిజీగా కనిపించారు. ఆమె మధ్యాహ్నం మూడుగంటలకు సెక్రటేరియట్కు వచ్చారు. అంతకు ముందుకానే ఆమె కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఆమె బాధ్యతలు చేపట్టిన తొలిరోజున ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అమ్మ క్యాంటిన్‌లు మరికొన్నిటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. 
 
అలాగే, కొత్తగా నిర్మించిన పోలీస్ ఉన్నత కార్యాలయాలు, వివిధ శాఖల కోసం కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు కూడా పచ్చ జెండా ఊపారు. తమ అధినేత్రి మళ్లీ సీఎం పీఠాన్ని అధిరోహించడంతో ఆ పార్టీ శ్రేణులు అమిత ఆనందాన్ని వ్యక్తంచేస్తున్నాయి.