శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 26 ఆగస్టు 2014 (10:08 IST)

తెలుగు రాష్ట్రాలకు పన్ను రాయితీ ఎలా ఇస్తారు?: మోడీకి జయ లేఖ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాంతీయ పన్ను రాయితీని ఎలా కల్పిస్తారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రశ్నించారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖాస్త్రం సంధించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాయితీలు కేటాయించడంపై జయలలిత తన అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో వ్యక్తీకరించారు. 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కొత్తగా రాయితీలు ఇవ్వవద్దని జయలలిత కోరారు. ఇలా ఇవ్వడం వల్ల పొరుగు రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనకు బ్రేక్ పడుతుందని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఆర్థిక ప్యాకేజీని జయలలిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. 
 
ఈ విధంగా రాయితీలు ఇవ్వడం వల్ల పొరుగు రాష్ట్రాలకు వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు తరలి ఆ రెండు రాష్ట్రాలకు తరలి వెళ్లే అవకాశం ఉందని జయలలిత అభిప్రాయపడ్డారు. అందువల్ల పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలను రద్దు చేయాలని ఈ లేఖలో జయలలిత ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.