శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (20:22 IST)

మద్రాసు వర్శిటీ ఆడిటోరియంలో ఉ.11 గంటలకు జయలలిత ప్రమాణం.. మంత్రుల లిస్టు ఇదే..

మద్రాసు విశ్వవిద్యాలయంలో ఆడిటోరియంలో శనివారం ఉదయం 11 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు రాజ్‌భవన్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. 
 
చెన్నైలోని మద్రాసు యూనివర్శిటీలో శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేస్తారని రాజ్‌భవన్ ఓ అధికారిక ప్రటనలో వెల్లడించింది. ఈ కార్యక్రమంలో జయలలితతో పాటు.. మొత్తం 28 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది.
 
 
ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, అన్నాడీఎంకే కార్యకర్తలు, భారీగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. ఎనిమిది నెలల తర్వాత ఈ రోజు మీడియాకు కనిపించిన జయ... గవర్నర్ రోశయ్యను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశాక రాజ్‌భవన్ అధికారిక ప్రకటనను వెల్లడించింది. 
 
కాగా, జయలలిత మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వీరే... 
1. ఓ. పన్నీర్ సెల్వం - ఆర్థి, ప్రజాపనుల శాఖ 
2. నత్తం ఆర్ విశ్వనాథన్ - విద్యుత్, ఎక్సైజ్ శాఖ 
3. ఆర్. వైద్యలింగం - గృహ, పట్టణాభివృద్ధి, వ్యవసాయ శాఖ 
4. ఎడప్పాటి కె పళనిస్వామి - రహదారులు, చిన్నతరహా పోర్టులు, అడవుల శాఖ 
5. పి. మోహన్ - గ్రామీణ పరిశ్రమలు, కార్మిక శాఖ
6. బి. వళర్మతి - సాంఘీక సంక్షేమ శాఖ 
7. పి. పళనియప్పన్ - ఉన్నత విద్యాశాఖ
8. సెల్లూరు కే రాజు - సహకార శాఖ 
9. ఆర్. కామరాజ్ - ఆహార, దేవాదాయ శాఖ
10. పి. తంగమణి - పరిశ్రమల శాఖ  
11. వి. సెంథిల్ బాలాజీ - రవాణా శాఖ
12. ఎం.సి. సంపత్ - వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ 
13. ఎస్.పి. వేలుమణి - పురపాలక, గ్రామీణాభివృద్ధి, న్యాయ, కోర్టులు, జైళ్ళ శాఖ 
14. టీకేఎం చిన్నయ్య - పశుసంవర్ధక శాఖ 
15. ఎస్. గోగుల ఇందిర - చేనేత పరిశ్రమల శాఖ 
16. ఎస్. సుందర్ రాజ్ - క్రీడలు, యువజన సంక్షేమం 
17. ఎస్.పి. షణ్ముగనాథన్ - పర్యాటక శాఖ 
18. ఎన్. సుబ్రమణియన్ - ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ 
19. కేఏ. జయపాల్ - ఫిషరీస్
20. ఎన్. సుబ్రమణియన్ - ఇన్ఫర్మేషన్ శాఖ 
21. ఆర్. బి ఉదయ కుమార్ - రెవెన్యూ
22. కేటీ రాజేంద్ర బాలాజీ - సమాచార, ప్రత్యేక ప్రణాళికల అమలు శాఖ 
23. బీవీ రమణ - మిల్క్ అండ్ డైరీ డెవలప్‌మెంట్ 
24. కేసీ వీరమణి - పాఠశాల విద్య 
25. ఎన్.డి. వెంకటాచలం - పర్యావరణ 
26. టీపీ పూనాచ్చి - ఖాదీ శాఖ 
27. ఎస్. అబ్దుల్ రహీం - బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ 
28. సి. విజయభాస్కర్ - ఆరోగ్యం శాఖ.