శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (17:52 IST)

జార్ఖండ్‌లో 61.93 శాతం.. జమ్మూకాశ్మీర్‌లో 70 శాతం పోలింగ్!

జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ దశలో సాయంత్రం 5 గంటల వరకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు జార్ఖండ్ రాష్ట్రంలో 61.93 శాతం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 70 శాతం మేరకు పోలింగ్ నమోదైంది. 
 
తొలి దశలో మావోయిస్టులు (జార్ఖండ్), తీవ్రవాదులు (జమ్మూకాశ్మీర్) ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న జార్ఖండ్‌లో 13 నియోజకవర్గాల్లో, జమ్ము కాశ్మీర్‌లో 15 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. 
 
ఈ క్రమంలో జార్ఖండ్ లో 61.92 శాతం పోలింగ్, జమ్ము కాశ్మీర్ లో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు కమిషన్ వివరించింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, పోలింగ్ శాతం ఇంకా పెరుగుతుందని అధికారులు అన్నారు.