బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (15:05 IST)

ఐటీ ఉద్యోగిని జిగీష హత్య కేసు : ఇద్దరు ముద్దాయిలకు మరణశిక్ష

ఐటీ ఉద్యోగిని జిగీష హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలకు మరణశిక్ష పడగా, ఒకరికి జీవిత కారాగారశిక్షను విధిస్తూ ఢిల్లీ కోర్టు తుదితీర్పును వెలువరించింది. సోమవారం వెలువడిన ఈ తీర

ఐటీ ఉద్యోగిని జిగీష హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలకు మరణశిక్ష పడగా, ఒకరికి జీవిత కారాగారశిక్షను విధిస్తూ ఢిల్లీ కోర్టు తుదితీర్పును వెలువరించింది. సోమవారం వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో జిగీషను కొంద‌రు దుండ‌గులు 2009లో కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హ‌త్య చేశారు. జిగీష త‌న‌ ఆఫీస్ క్యాబ్‌లోంచి త‌న ఇంటి వ‌ద్ద దిగిన వెంట‌నే దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి, ఆమె వద్ద ఉన్న విలువైన సామాగ్రి దోచుకుని ఆ దారుణానికి పాల్ప‌డ్డారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, మూడు రోజుల తర్వాత హర్యానా సూరజ్‌కుండ్‌ ప్రాంతంలో ఆమె మృతదేహం ల‌భించింది. ఈ కేసులో రవికపూర్‌, బల్‌జీత్‌, అమిత్‌ శుక్లాలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన కోర్టు... ఈ ముగ్గురుని దోషులుగా తేల్చింది. వారిలో రవి కపూర్‌, అమిత్‌ శుక్లాలకు మరణశిక్ష విధించిన కోర్టు బల్‌జీత్‌ మాలిక్‌కు మాత్రం జీవిత ఖైదును విధిస్తున్న‌ట్లు పేర్కొంది.