మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2016 (11:30 IST)

అఫ్జల్‌ గురుకు మద్దతుగా నినాదాలు చేశాం : జేఎన్‌యు విద్యార్థి ఉమర్ ఖలీద్

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉరితీసిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేసిన మాట వాస్తవమేనని ఆ వర్శిటీ విద్యార్థి ఉమర్ ఖలీద్ అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. గత రాత్రి అత్యంత నాటకీయ పరిణామాలు, హైడ్రామా మధ్య అరెస్టయిన ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 
 
ఆ తర్వాత వీరిని దక్షిణ ఢిల్లీలోని కార్యాలయంలో ఉంచారు. అక్కడ పోలీసులు దాదాపు ఐదు గంటల పాటు విచారణ జరిపారు. ఈ విచారణలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించినట్టు సమాచారం. ముఖ్యంగా.. విచారణలో అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేసినట్టు ఖలీద్ ఒప్పుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. 
 
కాగా, వీరిద్దరిపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అరెస్టయిన వీరిద్దరినీ బుధవారం కోర్టు ముందు ప్రవేశపెట్టనుండా, మిగతా విద్యార్థులు రామనాగ, అశుతోష్ కుమార్, అనంత్ ప్రకాష్‌లు బుధవారం లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి.