బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (14:32 IST)

ఆ పుస్తకం పూర్తికాకుండానే.. దివికెగసిన అబ్దుల్ కలాం... అది ఏ పుస్తకం..?

దేశాభివృద్ధి కోసం ఎన్నో పుస్తకాలు రాసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం.. తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి కోసం అన్ని రకాల సాధ్యాసాధ్యాలను చర్చిస్తూ ప్రయోజనకరమైన పుస్తకం రాస్తున్నారు. అయితే ఆ పుస్తకం రాయడం పూర్తికాకుండానే కలాం కన్నుమూశారు. ఈ పుస్తకం కలాం కల. తన కలల పుస్తకం పూర్తికాకుండానే కలాం లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 
 
తమిళనాడు అభివృద్ధి కోసం విజన్ 2020 మాదిరిగా రాస్తున్న ఆ పుస్తకం ఏడు అధ్యాయాలు పూర్తయ్యిందని ఆయన సన్నిహితుడు..పుస్తకం సహ రచయిత, కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన సైంటిఫిక్ సలహాదారు వి. పోన్ రాజ్ తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత రాష్ట్రంగా తమిళనాడు ఎదగాలని కలాం ఆశిస్తుండే వారని, తమిళవాడు గొప్పగా అభివృద్ది సాధించాలని కలలు కనేవారని పోన్ రాజ్ చెప్పారు. 
 
ఇందులో భాగంగానే ''ఎన్నత్తిల్ నలమిరున్‌దాల్ కనవు తమిళగం ఉరువాగుం.. పుయలై తాండినల్ తెండ్రల్'' అనే పేరున్న పుస్తకం రాశారని, ఏడు అధ్యాయాలు పూర్తయ్యాయని, చివరిగా జూలై 23ల తేదీన ఈ పుస్తకం గురించి తనతో మాట్లాడారని పోన్‌రాజ్ చెప్పారు.