శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2015 (18:07 IST)

ఆ రోజున కలాం రాష్ట్రపతిని వదులుకోవాలనుకున్నారు: ఎస్ఎం ఖాన్

ఆర్ఎన్ఐ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న నాటి రాష్ట్రపతి అబ్ధుల్ కలాం ప్రెస్ సెక్రటరీ ఎస్ఎం ఖాన్ ఆదివారం శిక్ష్యా ఓ అన్సందన్ యూనివర్శిటీలో ఉపన్యాసంలో కలాం జీవిత విశేషాలను గుర్తు చేశారు. 'మై డేస్ విత్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ సోల్ ఎవెర్' అనే టాపిక్పై ఆయన మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 2005 సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత ఆనాడు రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం తన పదవిని వదులుకోవాలని భావించారని గుర్తు చేశారు.
 
2005లో బీహార్ అసెంబ్లీని రద్దు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని దానిని రాష్ట్రపతికి పంపించిందని, ఆ సమయంలో దానిని వెనక్కి పంపే అధికారం రాష్ట్రపతిగా కలాంకు ఉందని, అయితే, అలా పంపిన తర్వాత మరోసారి అదే తీర్మానం రాష్ట్రపతి వద్దకు వస్తే తిరిగి పంపించే అధికారం ఆయనకు లేనందున అయిష్టంగానే కలాం సంతకం చేశారని ఖాన్ తెలిపారు. అయితే దానిని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురైనట్లు చెప్పారు. ఈ విషయానికి సంబంధించి అబ్దుల్ కలాం రామేశ్వరం వెళ్లి తన సోదరుడిని కలిసి మాట్లాడారని ఖాన్ చెప్పుకొచ్చారు.