గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 9 జనవరి 2017 (14:14 IST)

జల్లికట్టు అంటే ఇష్టం లేదా? ఐతే బిర్యానీపై కూడా నిషేధం విధించండి: కమల్ హాసన్

తమిళనాడులో ప్రస్తుతం నిషేధానికి గురైన జల్లికట్టుపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. జల్లికట్టు అంటే ఇష్టం లేనివారు బిర్యానీ తినడం కూడా మానేయాలని అన్నారు. తమిళులు సంప్రదాయమైన జల్లికట్ట

జల్లికట్టు క్రీడను సుప్రీం కోర్టు నిషేధించడంతో తమిళ సంప్రదాయ, సాహస క్రీడ అయిన జల్లికట్టు లేని సంక్రాంతిని గడుపుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. జల్లికట్టు లేకుండా గత ఏడాది సంక్రాంతి కూడా జరుకునేసిన తరుణంలో తమిళుల సంప్రదాయ, సాహస క్రీడను రక్షించుకునేందుకు యువజనం నడుం బిగించింది. ఫేస్‌బుక్‌లో ఏకమైన వేలాది మంది చెన్నై వైపుగా ఆదివారం కదం తొక్కారు. 
 
మెరీనా తీరంలో శాంతియుత ర్యాలీతో జల్లికట్టు కోసం పట్టుబట్టారు. తమిళుల వీరత్వాన్ని చాటే సాహసక్రీడగా ప్రసిద్ధి చెందిన జల్లికట్టుపై నిషేధంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రీడను రాక్షస క్రీడగా జంతు ప్రేమికులు అభివర్ణించడం చిక్కుల్ని తెచ్చిపెట్టింది. కాగా జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు తమిళనాడులో జల్లికట్టు ఆటపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. 2014లో వెలువరించిన ఈ తీర్పును పున:సమీక్షించాలంటూ గతేడాది ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సైతం తిరస్కరించింది.
 
ఈ నేపథ్యంలో.. తమిళనాడులో ప్రస్తుతం నిషేధానికి గురైన జల్లికట్టుపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. జల్లికట్టు అంటే ఇష్టం లేనివారు బిర్యానీ తినడం కూడా మానేయాలని అన్నారు. తమిళులు సంప్రదాయమైన జల్లికట్టు క్రీడంటే తనకు ఎనలేని అభిమానమని చెప్పుకొచ్చారు. గతంలోనూ అనేక సందర్భాల్లో జల్లికట్టును సమర్థిస్తూ కమల్ ఇదేరీతిగా స్పందించారు.
 
స్పెయిన్‌లో జరిగే బుల్‌ఫైట్‌లా జల్లికట్టును అపార్థం చేసుకోరాదనీ... సంప్రదాయంగా కొనసాగించే జల్లికట్టును తిరిగి ప్రారంభించాలని కమల్ హాసన్ పేర్కొన్నారు. స్పెయిన్‌లో ప్రజలు పశువులను గాయపర్చడం వల్ల అవి ప్రాణాలు కోల్పోతాయనీ... అయితే తమిళనాడులో ఎద్దులను దేవుడిగా కొలుస్తారని, తమ కుటుంబంలో ఓ సభ్యుడిగా భావిస్తారని గుర్తుచేశారు.
 
జల్లికట్టు అంటే ఎద్దును మచ్చిక చేసుకోవడం. అంతేగాని వాటి కొమ్ములను విరవడం లేదా మరే ఇతర శరీర భాగాలను భౌతికంగా గాయపర్చడం వంటివి ఇందులో ఏమాత్రం ఉండదని కమల్ హాసన్ పేర్కొన్నారు.