శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (10:11 IST)

ఉగ్రదాడుల నిందితుల ఉరిని రద్దుచేయాలి... ఎంపీ కనిమొళి డిమాండ్..

1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు నేపథ్యంలో మరణశిక్షపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడులకు పాల్పడే నిందితులకు ఉరే శిక్ష వేయడం సబబే అని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం ఈ శిక్షను రద్దు చేయాల్సిందేనని వాదిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ డీఎంకే చీఫ్ కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి స్పందించారు.
 
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఉగ్రదాడులకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించడం సరికాదన్నారు. ఈ శిక్షణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె రాజ్యసభలో ప్రైవేటు మోషన్‌ను దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం చర్చ జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.