గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 7 మార్చి 2018 (18:21 IST)

సినీ నటులు రాజకీయ పార్టీ పెడితే అంతేనా? కన్నడ నటుడు ఉపేంద్ర పార్టీ...

కన్నడ నటుడు ఉపేంద్ర.. ఈ పేరు వింటేనే వెరైటీ గెటప్‌లతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే వ్యక్తి గుర్తొస్తాడు. ఏ క్యారెక్టర్ చేసినా అందులో లీనమైపోగల వ్యక్తి ఉపేంద్ర. ఉపేంద్ర కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తే అయినా తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నట

కన్నడ నటుడు ఉపేంద్ర.. ఈ పేరు వింటేనే వెరైటీ గెటప్‌లతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే వ్యక్తి గుర్తొస్తాడు. ఏ క్యారెక్టర్ చేసినా అందులో లీనమైపోగల వ్యక్తి ఉపేంద్ర. ఉపేంద్ర కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తే అయినా తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు మంచి హిట్లను కూడా ఇచ్చాయి. విలన్‌గా అయినా, హీరోగా అయినా ఉపేంద్ర తెలుగులో ఎన్నో సినిమాలకు చేశారు. ఇక కన్నడలో అంటారా.. చెప్పనవసరం లేదు. టాప్ హీరోల్లో ఉపేంద్ర ఒకరు. ఇంతటి పేరున్న ఉపేంద్ర సరిగ్గా సంవత్సరం క్రితం ఒక పార్టీని స్థాపించారు.
 
ఆ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షులు ఉపేంద్రానే. పార్టీ పేరు కర్ణాటక ప్రజ్ఞవంట జనతా పార్టీ. ఈ పార్టీని సరిగ్గా సంవత్సరం మాత్రమే నడపగలిగారు. అది కూడా ఎలాంటి ప్రచారం లేకుండా హంగూ ఆర్భాటం లేకుండా సింపుల్‌గా రాజకీయ పార్టీని నడిపారు. దీంతో ఆ పార్టీలోని నేతల్లోల నుంచి ఉపేంద్రకు వ్యతిరేకత ప్రారంభమైంది. రాజకీయ పార్టీ అంటే ఎలా ఉండాలి. పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు ఇంకెలా ఉండాలి. మరో రెండు నెలల్లో కర్ణాటక ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటివరకు పార్టీ అభ్యర్థులను ఎవరిని నిలబెట్టాలి. ఎలా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోలేదు ఉపేంద్ర. 
 
ఉపేంద్ర వ్యవహార శైలి నచ్చకుండా చాలామంది నేతలు పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు. ఇక ఉపేంద్ర తప్ప ఎవరో ఒకరిద్దరు మాత్రమే పార్టీలో ఉన్నారు. దీంతో ఉపేంద్ర రాజకీయ పార్టీని పూర్తిగా రద్దు చేసుకోవాలన్న ఆలోచనలోకి వచ్చేశారట. మరో వారంరోజుల్లో తన పార్టీని రద్దు చేసుకుని భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చేశారట. కర్నాటకలోని బిజెపి నాయకులతో ఇప్పటికే ఉపేంద్ర టచ్‌లో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.