Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మంటగలిసిన మానవత్వం... ప్రమాదంలో రక్తమోడుతున్న బాలుడిని ఫోటోల కోసమే....

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (15:36 IST)

Widgets Magazine
accident logo

మానవత్వం మంటగలుస్తుందోన్న మాటకు మరో నిదర్శనం కర్నాటకలో ఈ దారుణం. 15 ఏళ్ల అలీ అనే బాలుడు సైకిల్ పైన వెళుతుండగా బస్సు ఢీకొట్టింది. బస్సు ఢీకొట్టడమే కాకుండా పత్తా లేకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడి రోడ్డుపై రక్తమోడుతో రక్షించమంటూ ఆర్తనాదాలు చేస్తుంటే, అతడి చుట్టూ గుమిగూడినవారు మాత్రం అతడిని రక్షించడం అటుంచి సెల్ ఫోన్లలో అతడిని చిత్రీకరించారు. దాదాపు అర్థగంటకు పైగా అతడు అక్కడే రోడ్డుమీద ప్రాణాల కోసం కొట్టుమిట్టాడాడు. బాధితుడిని చివరికి ఆసుపత్రికి తరలించేసరికి అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. 
 
కాగా తన సోదరుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి వుంటే అతడిని ప్రాణాలతో కాపాడుకునేవారమని విలపించాడు. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి మాట్లాడుతూ... బాలుడి నడుము కింది భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అతడిని చూసి తామంతా షాక్ తిన్నట్లు చెప్పుకొచ్చాడు. దానితో అతడిని ఎలా రక్షించాలో తెలియక మైండ్ మొద్దుబారిపోయిందని చెప్పాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అనంతలో బీహార్ ఆటవిక చర్య : మంచినీటి తొట్టె వద్దన్నందుకు మహిళను చితక్కొట్టారు

గతంలో బీహార్ రాష్ట్రంలో ఎక్కువగా ఆటవిక చర్యలు జరుగుతుండేవి. ఇలాంటి ఆటవిక చర్యలు ఇపుడు ...

news

చెవి రంధ్రంలో దూరిన పైతాన్.. ఫేస్‌బుక్‌లో సెల్ఫీ.. షేర్లు, లైక్స్ వెల్లువ

చెవి రంధ్రంలో పైతాన్ అదే.. కొండచిలువ దూరింది. ఇదేంటి? కొండ చిలువ చెవిపోగులు ధరించే ...

news

సీఎం కేసీఆర్ జీతం చూస్తే కళ్ళు తిరగాల్సిందే.. జయలలిత ఒక్కరూపాయి తీసుకునేవారు!

దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోనూ సీఎం కేసీఆర్ జీతమే టాప్. ఇంతకీ ఆయన జీతం ఎంతో ...

news

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లా రహదారులు రక్తమోడాయి. గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ...

Widgets Magazine