మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 28 మే 2016 (16:28 IST)

దండం పెట్టినా వదలని 'కామ' జేడీఎస్ లీడర్... అరెస్టు చేసిన పోలీసులు

కర్నాటకలో ఓ మహిళపై అత్యాచార యత్నం చేసిన 'కామ' జేడీఎస్ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను పరిశీలిస్తే కర్నాటకలోని మాండ్యా జిల్లా కెస్టూరు పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఓ మహిళపై అత్యాచార యత్నం చేసిన ఘటన వెలుగుచూసింది. ఆమెకు భర్త లేకప

కర్నాటకలో ఓ మహిళపై అత్యాచార యత్నం చేసిన 'కామ' జేడీఎస్ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను పరిశీలిస్తే కర్నాటకలోని మాండ్యా జిల్లా కెస్టూరు పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఓ మహిళపై అత్యాచార యత్నం చేసిన ఘటన వెలుగుచూసింది. ఆమెకు భర్త లేకపోవడంతో పంచాయతీ ప్రెసిడెంట్  దాన్ని అలుసుగా తీసుకుని ఆమెపై అత్యాచారం చేయబోయాడు. సదరు మహిళ అతడి ప్రయత్నాన్ని ఎంత అడ్డుకున్నా, చివరికి చేతులు జోడించి దండం పెట్టినా అతడు ఆమెను వదల్లేదు. 
 
ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఈ ఘటన అంతా కార్యాలయంలోని సీసీ కెమేరాల్లో రికార్డు కావడంతో అతడి బండారం బట్టబయలైంది. ఇతడు జేడీఎస్‌కు చెందిన చంద్రహాస్ అని తేలింది. అతడు పాల్పడిన దారుణమంతా మీడియాలో కూడా రావడంతో కర్నాటకలో అతడిపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇంతకుముందు కూడా ఇతడు ఇలాగే పలువురు మహిళలపై ఇలాంటి నీచానికి పాల్పడినట్లు కేసులున్నాయని అంటున్నారు. విపక్ష పార్టీకి చెందిన ఈ నాయకుడిని కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.