Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కర్ణాటకలో హంగ్... రేవణ్ణకు బీజేపీ గాలం... 10 మంది ఎమ్మెల్యేలు జంప్...

మంగళవారం, 15 మే 2018 (15:30 IST)

Widgets Magazine

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇందులోభాగంగా, 40 సీట్లతో మూడో స్థానంలో ఉన్న జేడీఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే బయట నుంచి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటించింది.
hd revanna
 
ఇదిలావుంటే, మ్యాజిక్ ఫిగర్‌కు కాస్త దూరంలో నిలిచిపోయిన బీజేపీ కూడా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ఇందులోభాగంగా దేవెగౌడ కుమారుడు రేవణ్ణతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తనతో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. మద్దతు ఇచ్చేందుకు తాను సిద్ధమని బీజేపీకి రేవణ్ణ భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే... కన్నడ నాట బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
 
ఇదిలావుండగా, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 104 స్థానాలను దక్కించుకుంది. సాధారణ మెజారిటీకి కాస్త దూరంలో బీజేపీ ఉంది. రెండోస్థానంలో కాంగ్రెస్‌ ఉండగా జేడీఎస్‌ కీలకంగా మారింది. కాగా కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమిగా పీఠం ఎక్కేందుకు రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్ 77 స్థానాల్లో పట్టు నిలుపుకుంటే.. జేడీ(ఎస్) 40 స్థానాల్లో గెలిచింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

#KarnatakaVerdict : బీజేపీకి షాక్... జేడీఎస్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడలేదు. ప్రస్తుతాని వెల్లడైన ఫలితాల మేరకు ఏ ...

news

జెరూసలెంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తించాలి.. గాజాలో ఘర్షణ.. 40మంది మృతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెరూసలెంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తించాలని వివాదస్పద ...

news

కర్ణాటకలో సంచలనం... జేడీఎస్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్... సీఎంగా కుమారస్వామి?

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేదు. దీంతో హంగ్ ...

news

'డైలాగ్ కింగ్‌'ను ఓడించిన తెలుగు ఓటర్లు.. బళ్ళారిలో బలంగా వీచిన "గాలి"

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటుడు, డైలాగ్ కింగ్ సాయి ...

Widgets Magazine