శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 9 అక్టోబరు 2015 (19:29 IST)

ఇద్దరు రేప్ చేస్తే గ్యాంగ్ రేప్ కాదన్న కర్నాటక మంత్రి... ఎన్‌సిడబ్ల్యు నోటీసులు

కర్నాటక హోం మంత్రి కె.జె. జార్జ్ టంగ్ స్లిప్ అయ్యిందో లేదంటే కావాలనే అనేశారో తెలియదు కానీ గ్యాంగ్ రేప్ ఘటనపై ఆయన స్పందించిన తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. దాంతో ఆయన సారీ చెప్పారు. ఐనా ఆయన చేసిన వ్యాఖ్యలకు జాతీయ మహిళా కమిషన్ నోటీసు పంపింది. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసును పంపింది. 
 
ఈ సందర్భంగా జాతీయ మహిళా కమీషన్ చీఫ్ లలితా కుమారమంగళం మాట్లాడుతూ... అసలా మంత్రికి అత్యాచారం అంటే ఏమిటో తెలియదనీ, అందువల్ల ఆయన అలా మాట్లాడారనీ, మహిళపై లైంగిక వేధింపులు జరిగినా దానిపై కఠినంగా వ్యవహరించడం మాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు.
 
22 ఏళ్ల బీపీఓ ఉద్యోగినిపై బెంగళూరులో జరిగిన అత్యాచార ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. ఇద్దరు చేస్తే అది గ్యాంగ్ రేప్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీనిపై తీవ్రమైన విమర్శలు రావడంతో శుక్రవారం నాడు నాలుక సరిచేసుకుంటూ... అత్యాచారం అంటే అత్యాచారమే. అది ఒక్కరు చేసినా గ్యాంగ్ చేసినా... అంటూ తను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతున్నట్లు విన్నవించుకున్నారు.