సహనం కోల్పోయిన కర్ణాటక మంత్రి (వీడియో)

మంగళవారం, 21 నవంబరు 2017 (10:26 IST)

dk sivakumar

కర్ణాటక మంత్రి ఒకరు సహనం కోల్పోయారు. ఆయన పేరు డీకే శివకుమార్. మీడియాతో మినిస్టర్ మాట్లాడుతుండగా.. ఓ యువకుడు సెల్ఫీ తీసుకోబోయాడు. ఆ కుర్రోడి చర్యలను అసహనంగా భావించిన మంత్రి... లాగి చేయిపై ఒక్క దెబ్బకొట్టాడు. అంతే ఆ యువకుడి చేతిలోని మొబైల్ కిందపడిపోయింది. 
 
పిల్లల హక్కులపై బెల్గాంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాతున్న సమయంలో వెనుక నుంచి ఓ యువకుడు సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే మంత్రి ఆగ్రహించి.. ఆ అబ్బాయిని కొట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
అయితే, యువకుడిని కొట్టడాన్ని మంత్రి శివకుమార్ సమర్థించుకున్నారు. ఇలాంటి సంఘటనలు సహజమేనని చెప్పుకొచ్చారు. కొంచెమన్న ఇంకితజ్ఞానం ఉండాలి. నేను మీడియాతో మాట్లాడుతున్నప్పుడు సెల్ఫీ తీసుకోవడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. ఆగస్టు నెలలో మంత్రి శివకుమార్ నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ శాఖ దాడులు చేసిన విషయం విదితమే. సుమారు రూ.300 కోట్లకు పైగా ఆస్తులను ఐటీ శాఖ గుర్తించినట్లు సమాచారం.

 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఉగ్రవాద పోషక దేశంగా ఉత్తర కొరియాను ప్రకటిస్తున్నాం: ట్రంప్

ఉత్తర కొరియాను ఉగ్రవాదులను పోషిస్తున్న దేశంగా అమెరికా ప్రకటించింది. ప్రపంచం ...

news

నా పేరులోనే ''చిల్'' ఉంది.. శశి ట్వీట్‌కు మానుషి కౌంటర్

"మిస్ వరల్డ్ 2017".. మానుషి చిల్లార్. 17 యేళ్ల క్రితం సుస్మితా సేన్ ఈ కిరీటాన్ని ...

news

చెన్నై ఎయిర్ పోర్టులో వ్యక్తి హంగామా.. రన్ వేపైకి వచ్చి..?

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. రన్ వే వద్దకు దూసుకెళ్లి.. ...

news

'ప‌ద్మావ‌తి'కి దీదీ స‌పోర్ట్‌... స్వేచ్ఛను నాశనం చేస్తున్న ఆ పార్టీ

బాలీవుడ్ చిత్రం 'పద్మావతి'కి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంపూర్ణ మద్దతు ...