Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'డైలాగ్ కింగ్‌'ను ఓడించిన తెలుగు ఓటర్లు.. బళ్ళారిలో బలంగా వీచిన "గాలి"

మంగళవారం, 15 మే 2018 (13:09 IST)

Widgets Magazine

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ చిత్తుగా ఓడిపోయారు. ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత 2008లో కూడా సాయికుమార్ ఇక్కడ నుంచి పోటీ ఓటమిపాలయ్యారు.
sai kumar
 
తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్ ‌- కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి శాసన సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటి చేశారు. అయితే ఈ డైలాగ్‌ కింగ్‌కు తెలుగు సెంటిమెంట్‌ కలిసిరాలేదు. బీజేపీపై ఉన్న కోపం ఆయనపై చూపించారు. దీనికితోడు కాంగ్రెస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి గెలుపును ఆయన అడ్డుకోలేక పోయారు. ఫలితంగా సాయికుమార్ నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. 
 
మరోవైపు, బళ్ళారి రీజియన్‌లో గాలి జనార్ధన్ రెడ్డి హవా ఏమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపితమైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన అనుచరులు విజయం దిశగా దూసుకెళుతున్నారు. బళ్లారిలో గాలి సోమశేఖర రెడ్డి, హరప్పనహళ్లిలో గాలి కరుణాకర్‌రెడ్డి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గాలి బద్రర్స్ ప్రధాన అనుచరుడు శ్రీరాములు మొలుకాల్మూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. మరో స్థానం బాదామిలో మాత్రం సిద్దరామయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. గాలి బ్రదర్స్ మరో ప్రధాన అనుచరుడు ఫకీరప్ప కూడా విజయం దిశగా దూసుకెళ్తున్నాడు.
 
కాగా, బళ్లారి రీజియన్‌లో మొత్తం 9 మందికి గాలి బ్రదర్స్ టికెట్లు ఇప్పించుకున్నారు. వీరిలో ఆరుగురు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. బళ్లారిలో గాలి జనార్థన్ రెడ్డి తన సత్తాచాటాడు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కూడా వినియోగించుకోలేకపోయినా గాలి.. తన వారికి మాత్రం గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీకి నిద్రలేకుండా చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చంద్రబాబు చేతకానితనం... 2019లో సత్తా చూపిస్తా: కన్నా లక్ష్మీనారాయణ

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించినందుకు అమిత్ షా, మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు కన్నా ...

news

కింగూ కాదు.. మేకూ కాదు :: ఓట్లలో 2 శాతం కోత.. జేడీఎస్‌కు 40 సీట్లు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీ కీలకపాత్ర ...

news

#KarnatakaElectionResults2018 : కాంగ్రెస్ "ముక్త్ భారత్" తథ్యమా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన "కాంగ్రెస్ ముక్త్ భారత్" పిలుపు సార్ధకమయ్యేలా ...

news

#KarnatakaVerdict : సీఎం సిద్ధరామయ్య ఓటమి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటమిపాలయ్యారు. ఈ ...

Widgets Magazine