గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (10:24 IST)

పి.చిదంబరంకు షాక్.. కుమారుడు కార్తీ చిదంబరం అరెస్టు

కేంద్ర ఆర్థిక మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం అరెస్టు అయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఆయనను సీబీఐ అధికారులు బుధవారం అరెస్టు చేశారు.

కేంద్ర ఆర్థిక మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం అరెస్టు అయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఆయనను సీబీఐ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయనను... చెన్నై ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకుని, తమ కార్యాలయానికి తరలించారు. 
 
యూపీఏ హయాంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్ఎక్స్ మీడియా స్కాం చోటుచేసుకుంది. 2007లో ఐఎన్ఎక్స్ మీడియా నిధులు పొందేందుకు వీలుగా ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎప్ఐపీబీ) అనుమతులు మంజూరు చేసింది. ఈ అనుమతుల మంజూరులో కార్తీ చిదంబరం చక్రం తిప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి. 
 
అలాగే, మనీలాండరింగ్ కేసులో కూడా ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయన కార్యాలయంతో పాటు చిదంబరం నివాసంలో కూడా తనిఖీలు చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు సహకరించడం లేదని పేర్కొంటూ ఆయనను అరెస్టు చేయడం జరిగింది. ఆయనను ఢిల్లీకి తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
మరోవైపు, కార్తీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ ఎస్.భాస్కరరామన్‌ను ఢిల్లీ కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. ఈడీ అధికారులు భాస్కర రామన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా స్పెషల్ జడ్జ్ ఎన్కే మల్హోత్రా ఆయనను కస్టడీకి తరలిస్తూ తీర్పును వెలువరించారు. వెంటనే అక్కడ నుంచి ఆయనను తీహార్ జైలుకు పోలీసులు తరలించారు.