Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డీఎంకే అధినేత కరుణానిధికి అస్వస్థత... కావేరీ ఆస్పత్రిలో చేరిక

గురువారం, 1 డిశెంబరు 2016 (11:32 IST)

Widgets Magazine
karunanidhi

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై ఆళ్వార్ పేటలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం తెల్లవారుజామున ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన కావేరి ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా... ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్య సేవలు కొనసాగుతున్నాయని కావేరి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కొన్ని రోజులపాటు ఆస్పత్రిలోనే ఆయనకు చికిత్స అందించాల్సి ఉందని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే. 
 
కాగా, బుధవారమే తన ఇద్దరు కుమారులైన ఎంకే అళగిరి (పెద్ద కుమారుడు), ఎంకే స్టాలిన్ (చిన్న కుమారుడు)లను గోపాలపురంలోని తన నివాసానికి పిలిపించి.. మంతనాలు జరిపిన విషయం తెల్సిందే. దీంతో కరుణానిధి కుటుంబ సభ్యులతో పాటు... డీఎంకే శ్రేణులు సైతం ఎంతో ఆనందానికి గురయ్యారు. ఈ కలయిక జరిగి కొన్ని గంటలకు గడువకముందే కరుణానిధి తిరిగి ఆస్పత్రిలో చేరడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. తాళాలు మా చేతికి వచ్చాయి..

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ...

news

పాకిస్థాన్.. ఫెంటాస్టిక్ ప్లేస్.. ఫెంటాస్టిక్ పీపుల్.. డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ :: షరీఫ్‌ ఫోన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన డొనాల్డ్‌ అధ్యక్షుడు ...

news

ఖాకీ కర్కశత్వం : ఏటీఎంలో 2 కార్డులు వాడినందుకు చేయి విరగ్గొట్టారు

ఖాకీలు తమలోని కర్కశత్వాన్ని మరోమారు ప్రదర్శించారు. ఓ కానిస్టేబుల్ ప్రయోగించిన లాఠీ ...

news

కోల్‌కతా వైద్యుడి వద్ద రూ.10 లక్షల కొత్త కరెన్సీ నోట్లు..

దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలు తారా స్థాయిలో ఉన్నాయి. కొత్త నోట్లతో పాటు.. చిల్లర కోసం ...

Widgets Magazine