Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇక మనవంతు.. కశ్మీర్ క్రీడాకారుడికి వీసా నిరాకరించిన అంకుల్ శ్యామ్

హైదరాబాద్, బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (03:54 IST)

Widgets Magazine

ఏడు ముస్లిం దేశాల పౌరులను మాత్రమే తమ భూభాగంలోకి అడుగు పెట్టనివ్వమని ఆంక్షలు విధించిన అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనాయంత్రాంగం ఇప్పడు భారత ముస్లింలపై కన్నేసింది. ఫిబ్రవరి 24న న్యూయార్క్‌లో జరగనున్న వరల్డ్ స్నో షో చాంపియన్సిప్‌లో పాల్గొనడానికి వీసా దరఖాస్తు చేసుకున్న కశ్మీరీ క్రీడాకారుడు తన్వీర్ హుస్సేన్, అతడి మేనేజర్‌కి ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ వీసాలను తృణీకరించడం షాక్ కలిగిస్తోంది.
 
ప్రపంచ స్థాయి క్రీడలో పాల్గొనడానికి కఠోర శిక్షణ తీసుకున్న తనకు  తన మేనేజర్ అబిడ్ ఖాన్‌కు వీసాలు మంజూరు చేయలేమని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేయడంతో తీవ్ర నిరాశ కలిగిందని, మనసు గాయపడిందని  24 ఏళ్ల తన్వీర్ హుస్సేన్ వివరించారు. ఇటలీలో జరిగిన స్నోషో చాంపియన్ షిప్ పోటీలకు కూడా గత ఏడాది భారత్ తరపున హాజరయ్యానని, కాని అమెరికాలో క్రీడాకారులకు వీసాలు మంజూరు చేయడంలో ఏవయినా సమస్యలు ఉన్నాయేమో తెలీదని తన్వీర్ వాపోయాడు. 
 
ఫిబ్రవరి 24న అమెరికాలో నిర్వహిస్తున్న ఈ క్రీడకోసం దాదాపు నెలరోజులుగా గుల్‌మార్గ్‌లో శిక్షణ పొందానని, పోటీకి సన్నాహమవుతున్నానని, కానీ పోటీలో పాల్గొనే అవకాశం తనకు రాదని ఊహించలేదని తన్వీర్ వాపోయాడు. 
 
అమెరికాలో జరిగే ఆ ఈవెంట్ కోసం అయిదుగురు కాశ్మీరీలను ఆహ్వానించగా స్పాన్సర్ షిప్ సమస్యల కారణంగా తామిద్దరం మాత్రమే వీసాకు దరఖాస్తు చేశామని, అన్ని పత్రాలూ సమర్పించామని కానీ తమకు వీసా నిరాకరించారని తన్వీర్ తెలిపాడు. 
 
న్యూయార్క్ స్థానిక మేయర్ క్లైడ్ రబిడ్యు మాట్లాడుతూ ఈ కఠోర నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడానికి అమెరికా ప్రభుత్వం ప్రతినిధులతో సంప్రదిస్తున్నానని చెప్పారు.
 
ఉగ్రవాదులకు ఆంక్షలు విధించడం మాటేమో కానీ ట్రంప్ డిక్రీ దేశదేశాల ముస్లింలను వెంటాడటానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఒక్కసారి అమెరికాను వదిలి వెళ్లారో తిరిగి రావడం కల్లే..

ఉగ్రవాదులను దేశంలోకి రానీయకుండా చూడటం అంటే అంత నాజూగ్గా ఉంటుందా, 3 లక్షలమంది విదేశీ విమాన ...

news

వైఎస్ జగన్ పట్ల పవన్‌కు సాప్ట్ కార్నర్ పెరుగుతోందా: తొలిసారి వైకాపాకు అనుకూలంగా ప్రకటన

దాదాపు ఒకటన్నర సంవత్సరంగా ప్రత్యేక హోదాపై ఒంటరిపోరాటం చేస్తూ ఒంటరిగానే మిగిలిన జనసేన ...

news

నా అరెస్టు నీకు ఉపశమనం కాదు మోదీ.. ముందుంది ముసళ్ల పండుగ: హఫీజ్ సయీద్ హెచ్చరిక

పాకిస్తాన్ ప్రభుత్వం తనను హౌస్ అరెస్టు చేస్తే కశ్మీర్ స్వతంత్రపోరాటానికి చెక్ పెట్టవచ్చని ...

news

అమెరికాకు ఏమవుతుంది? 'డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఏ డాగ్'... ప్లకార్డులతో ఎన్నారైలు

డొనాల్డ్ ట్రంప్ పైన అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఏడు దేశాల ముస్లింలపై, ఆ ...

Widgets Magazine