Widgets Magazine

కేసీఆర్ కామెంట్స్ ఎఫెక్ట్... భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు బ్యాంకు వివరాలు చెప్పండి... మోదీ

మంగళవారం, 29 నవంబరు 2016 (14:24 IST)

Widgets Magazine
kcr-modi

సోమవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనువెంటనే ఆచరిస్తున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే నిన్న రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... నల్లడబ్బు అంటూ సామాన్యులను మాత్రమే టార్గెట్ చేసి వదిలేస్తే పారదర్శకత ఉన్నట్లు కాదనీ, అందువల్ల రాజకీయ నాయకులు సైతం వారివారి ఆస్తుల వివరాలన్నిటినీ ప్రజలకు తెలియజేయాలనీ, వారి వద్ద ఉన్న ధనం ఎంతో లెక్కచెప్పినప్పుడే ప్రజలు కూడా సమస్య పట్ల మరింత సానుకూలంగా ఉంటారని అన్నారు. ఈ మేరకు కేసీఆర్ మీడియాముఖంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పిలుపునిచ్చారు. 
 
ఈ నేపధ్యంలో మంగళవారం నాడు ప్రధానమంత్రి మోదీ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా తమతమ బ్యాంకు ఖాతా వివరాలన్నిటినీ నవంబరు 8 నుంచి డిసెంబరు 31 లోపు సమర్పించాలని కోరారు. ఆ వివరాలన్నీ భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు అందజేయాలన్నారు. 
 
సామాన్య ప్రజలను వేధిస్తూ మీరు మాత్రం నల్లడబ్బును దాచుకుంటున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు నరేంద్ర మోదీ ఈ చర్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఏదైతేనేం ధనవంతులు తమ డబ్బును పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి జీవితాల్లో వెలుగు రేఖలు పూస్తాయనడంలో సందేహంలేదు. మరి ఈ కార్యక్రమం ఎంతమేరకు ముందుకు వెళుతుందో చూద్దాం.Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎర్రచందనం వేటగాళ్ల ఆస్తులపై వేట..... కూపీ లాగుతున్న ఏపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్

ఎర్రచందనం దొంగల అక్రమాస్తులపై నిఘా పెరిగింది. గత పదేళ్ళలో ఎవరెవరు ఎంతెంత అక్రమంగా ...

news

యజమాని కోసం కట్లపామును చంపేసిన శునకం.. బైకు సీటుకు ఆనుకుని ఉన్న పామును చూసి?

శునకం విశ్వాసానికి మారు పేరు. శునకాలు యజమానుల పట్ల అమితమైన ప్రేమను కలిగివుంటాయి. యజమానుల ...

news

ల్యాండవుతున్న విమానంలో నుంచి గుబుక్కున కిందికి దూకేసిన మహిళ... ఎక్కడ?

ఓ మహిళ ల్యాండవుతున్న విమానంలో నుంచి కిందికి దూకేసింది. ఈ సంఘటన హ్యూస్టన్‌ ఎయిర్‌పోర్టులో ...

news

వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళకు బెత్తం దెబ్బలు.. బాధతో ఏడుస్తుంటే?

ఇండోనేషియాలో ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తారు. దాని ప్రకారం జూదం ఆడినా, మద్యం ...