శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 6 జులై 2015 (14:40 IST)

వ్యాపమ్ మరణాలు ఆపేందుకు ఏదో ఒకటి చేయాలి : కేజ్రీవాల్

వ్యాపమ్ మరణాలను ఆపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒకటి చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇందుకోసం ఈ స్కామ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని ఆయన స్పష్టంచేశారు. 
 
వ్యాపమ్ స్కామ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన వారి సంఖ్య 46కు చేరిన విషయం తెల్సిందే. గత మూడు రోజుల్లో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరిలో ఒకరు జర్నలిస్టు ఉండగా, రెండో వ్యక్తి వైద్య కాలేజీ డీన్, మూడో మృతి మహిళా ట్రైనీ ఎస్సైగా ఉంది. 
 
దీనిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతున్న వ్యాపమ్ కుంభకోణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ స్కామ్‌పై ప్రధాని ఇకేమాత్రం మౌనం వహించరాదన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. 'వ్యాపమ్ విషయంపై ప్రధాని మాట్లాడాలని, జోక్యం చేసుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. అందుకే ప్రధాని ఇక ఈ విషయంపై మౌనంగా ఉండకూడదు' అని అన్నారు.