శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 అక్టోబరు 2020 (18:48 IST)

ఆ వ్యాఖ్యలు కేరళ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం : సీఎం పినరయి విజయన్

క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డంలో కేర‌ళ విఫ‌ల‌మైందంటూ కొంత‌మంది త‌మ రాష్ట్ర‌ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ మండిప‌డ్డారు. 
 
దేశంలో మొట్ట‌మొద‌టి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది కేర‌ళ‌లోనేన‌ని, అప్ప‌టి నుంచి కూడా మేము క‌రోనా వైర‌స్‌ను విజ‌య‌వంతంగా క‌ట్ట‌డి చేశామ‌ని ఆయ‌న చెప్పారు. దేశంలో కొవిడ్ ప్రొటోకాల్ పాటించిన మొద‌టి రాష్ట్రం కూడా త‌మ‌దేన‌ని విజ‌య‌న్ తెలిపారు. 
 
కాగా, కేర‌ళ‌లో సోమ‌వారం 5,022 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. అదేసమ‌యంలో 7,469 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 21 మంది మృతిచెందారు. 
 
అయితే, కొత్త కేసుల కంటే రిక‌వ‌రీలు ఎక్కువ‌గా న‌మోదు కావ‌డంతో ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య మ‌రింత త‌గ్గింది. ప్ర‌స్తుతం అక్క‌డ 92,731 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేర‌ళ ముఖ్య‌మంత్రి ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 
 
ఇదిలావుండగా, ఈ నెల ప్రారంభం నుంచి 17వ తేదీ వరకూ కేరళలో వచ్చిన కరోనా కేసులు 1.35 లక్షలకు పైగానే. తొలి దశలో విజృంభించిన మహమ్మారిని నిలువరించడంలో విజయవంతమై, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కేరళ, పండగల వేళ నిబంధనలను సడలించి, తగిన మూల్యం చెల్లించుకుందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. 
 
పండగల వేళ, ప్రయాణాలను అనుమతించి తప్పు చేశారని, ప్రజలు మూకుమ్మడిగా పండగలు చేసుకునేలా నిబంధనలను సడలించారని ఆయన గుర్తుచేశారు. "ఓనమ్ పర్వదినాల్లో మహమ్మారి విజృంభించింది. రోజువారీ కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా దసరా - దీపావళి సీజన్ మొదలైంది. అన్ని రాష్ట్రాలూ కోవిడ్ ప్రణాళికల్లో అలసత్వం ప్రదర్శించరాదు" అని అన్నారు.
 
"ఓనమ్ సమయంలో చూపించిన నిర్లక్ష్యానికి కేరళ నష్టపోయింది. రాష్ట్రాల పరిధిలో వివిధ రకాల సేవలను తిరిగి ప్రారంభించడం, ప్రయాణాలు, వాణిజ్య కార్యకలాపాలు, పర్యాటక ప్రాంతాలు తిరిగి తెరవడం తదితర కారణాలతోనే కేరళలో కేసులు పెరిగాయి" అని సోషల్ మీడియాలో 'సండే సంవాద్' కార్యక్రమంలో తనకు ఎదురైన ప్రశ్నలకు హర్షవర్ధన్ బదులిచ్చారు. కేరళ ఉదంతాన్ని మిగతా రాష్ట్రాలు ఉదాహరణగా తీసుకుని కరోనా కట్టడిపై దృష్టిని సారించాలని ఆయన కోరారు.
 
కాగా, ఈ పండగ సీజన్ తో పాటు శీతాకాలం కూడా కలిసి రావడంతో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం నియమించిన ఓ కమిటీ హెచ్చరించిన గంటల తరువాత హర్షవర్ధన్, కేరళను లక్ష్యం చేసుకుని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
 
ఏ మతం కూడా ప్రాణాలను పణంగా పెట్టి, పండగలను చేసుకోవాలని చెప్పలేదని, ప్రజలు సాధ్యమైనంత వరకూ ఇంటికే పరిమితం కావాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. దాదాపు 46 రోజుల తరువాత యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షల లోపునకు తగ్గడం శుభ పరిణామమని చెప్పారు.