శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2017 (13:43 IST)

సముద్ర గర్భంలో గంటపాటు వివాహం.. ఉంగరాలు, దండలు మార్చుకుని..?

వివాహాలు వెరైటీగా చేసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. సముద్రం ఓడపై, ఆకాశంలో తేలుతూ చాలామంది ప్రస్తుతం వివాహం చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ జంట మాత్రం వినూత్నంగా సముద్ర గర్భంలో వివాహం చేసుకున్నారు. వ

వివాహాలు వెరైటీగా చేసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. సముద్రం ఓడపై, ఆకాశంలో తేలుతూ చాలామంది ప్రస్తుతం వివాహం చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ జంట మాత్రం వినూత్నంగా సముద్ర గర్భంలో వివాహం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే మహారాష్ట్రకు చెందిన నికిల్ పవార్, స్లోవేకియన్ దేశానికి చెందిన వధువు యూనికా పోగ్రాన్‌లు కేరళ రాష్ట్రంలోని కోవలం సముద్ర గర్భంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వేదికపై వధూవరులిద్దరూ ఉంగరాలు , ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న దండలు మార్చుకోవడం ద్వారా ఒక్కటయ్యారు. 
 
ఈ వివాహ తంతు దాదాపు గంట సేపు సాగింది. సైగల ద్వారా ఈ పెళ్ళి జరిగింది. సముద్రంలో జరిగిన పెళ్లితో సంతోషపడినా.. క్షణంపాటు భయాందోళనకు గురయ్యాయని వధువు యూనికా పోగ్రాన్ తెలిపారు. కేరళ సముద్ర గర్భంలో జరిగిన ఈ పెళ్లిని వరుడి సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలో రిజిస్టరు చేసుకున్నాడు. కాగా సముద్ర గర్భంలో వివాహం చేసకున్న జంటగా యూనికా, నికిల్‌లు రికార్డు సాధించారు.