బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (16:13 IST)

ఆ జడ్జీలు ఫూల్స్.. ఇడియట్స్.. సీపీఎం నేతకు 4 నెలల జైలు

న్యాయమూర్తులను ఫూల్స్, ఇడియట్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళకు చెందిన ఓ సీపీఎం మాజీ ఎమ్మెల్యే కటకటాలపాలయ్యాడు. సుప్రీంకోర్టు అతనికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. రోడ్డు ప్రమాదాలను, ప్రజలకు ఇబ్బందులను కలకుండా ఉండాలనే ఉద్దేశంతో కేరళ హైకోర్టు.. రోడ్లు, రోడ్డు పక్కన బహిరంగ సభలను నిషేధించింది. 
 
ఈ తీర్పుపై సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే ఎంవి జయరాజన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తీర్పు చెప్పిన జడ్జీలను ఫూల్స్, ఇడియట్స్ అంటూ నిందించాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు జయరాజన్‌కు తొలుత ఆర్నెల్లు జైలుశిక్ష విధించగా, ఆ తర్వాత దీన్ని నాలుగు నెలలకు తగ్గించింది. 
 
ఈ మేరకు జస్టిస్ విక్రమ్ జీత్, నాగప్పన్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. తీర్పుపై విమర్శలు వస్తే సమస్య లేదని, అయితే న్యాయాధికారులపై అనాగరిక, పరుష పదజాలం వాడితే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించింది.