శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (13:48 IST)

మత్స్యకారుడు కాదు... హృదయాలను గెలుచుకున్న రియల్ హీరో

కేరళలో వరద బాధితులను ఆదుకోవడంలో మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి వారి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, వెంగారలోని ముథాలమాద్ ప్రాంతంలోని ఒక ఇంటిలో ఒక చిన్నారితోపాట

కేరళలో వరద బాధితులను ఆదుకోవడంలో మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి వారి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, వెంగారలోని ముథాలమాద్ ప్రాంతంలోని ఒక ఇంటిలో ఒక చిన్నారితోపాటు ముగ్గురు మహిళలు చిక్కుకున్నారు. జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్డీఆర్‌ఎఫ్) జవాన్లు ఈ ప్రాంతానికి వెళ్లలేమన్నారు.
 
కానీ, స్థానిక మత్స్యకారుడు కేపీ జైసాల్ (32) వారిని కాపాడటానికి ముందుకొచ్చారు. సదరు మహిళలు ఎన్డీఆర్‌ఎఫ్ బెలూన్ బోటులోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటే జైసాల్ తన వీపును మెట్టుగాచేసి బోటులోకి వెళ్లేందుకు వీలుగా కిందకు వంగారు. ఒకరి తర్వాత మరొకరు అతడి వీపుపై కాలుపెట్టి బోటులోకి వెళ్లిపోయారు. 
 
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది. కేవలం జైసాల్ ఒక్కరే కాదు వందల మంది మత్స్యకారులు వరదల్లో చిక్కుకున్న తోటి వారిని కాపాడేందుకు తమ బోట్లను ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర సహాయ సిబ్బందికి అప్పగిస్తున్నారు. బాధితులను రక్షించడంలో ఎన్డీఆర్‌ఎఫ్ జవాన్లకు సాయపడుతున్నారు.