కన్నతండ్రి కూడా ఆ బాలికను వదిలి పెట్టలేదు.. ఏడుగురితో కలిసి రెండేళ్లు..?

gang rape
Last Updated: గురువారం, 6 డిశెంబరు 2018 (12:36 IST)
కేరళలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై ఏడుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో కన్నతండ్రి కూడా వున్నాడు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కన్నూరులో 16 ఏళ్ల బాలికపై ఏడుగురు కామాంధులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులకు షాకిచ్చే విషయం తెలియవచ్చింది. బాధిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల్లో ఆమె కన్నతండ్రి కూడా ఒకడని తెలిసింది. 
 
పదో తరగతి చదువుతున్న బాలికపై గత రెండేళ్ల పాటు కన్నతండ్రితో పాటు ఏడుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారని, చివరికి భరించలేక బాధితురాలు తల్లితో ఈ విషయం చెప్పగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందని కన్నూర్ జిల్లా పీసీ జీ శివ విక్రమ్ తెలిపారు. 
 
30 ఏళ్ల వయస్సున్న ఏడుగురు కామాంధులు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారని శివ చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో పరారీలో వున్న వ్యక్తులను అరెస్ట్ చేస్తామని శివ తెలిపారు.దీనిపై మరింత చదవండి :