Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమను తిరస్కరించిందనీ.. అందరూ చూస్తుండగానే వైద్య విద్యార్థినిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు!

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (11:51 IST)

Widgets Magazine
student fire

కేరళలోని కొట్టాయంలో ఘోరం జరిగింది. అందరూ చూస్తుండగానే 20 ఏళ్ల వైద్య విద్యార్థినిపై క్లాసులో ఓ అబ్బాయి పెట్రోలు పోసి తగలబెట్టేశాడు. ఆ తర్వాత తాను కూడా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అమ్మాయిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు విద్యార్థులు కూడా గాయపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కొట్టాయంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో భాగంగానే స్కూల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఎస్ఎంఈ) ఉంది. ఈ కాలేజీలో చదివే విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం కొందరు విద్యార్థులు కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆదర్శ్ అనే యువకుడు అదే కాలేజీలో చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం అతడు క్లాసులోకి నడుచుకుంటూ వచ్చి 23 యేళ్ళ యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించేశాడు. తర్వాత తాను కూడా నిప్పంటించుకున్నాడు. 
 
పెట్రోల్ పోసిన వెంటనే ఆ అమ్మాయి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఆదర్శ్ వెంటపడి పట్టుకుని మరీ తన వద్ద ఉన్న లైటర్‌తో ఆమె దుస్తులకు నిప్పంటించాడు. తర్వాత తను కూడా తన దుస్తులకు కూడా అదే లైటర్‌తో నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ఆస్పత్రిలో మరణించారు. వీరిద్దరూ ఫిజియోథెరపీ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్నారు.  
 
దీనిపై కొందరు విద్యార్థులు స్పందిస్తూ.. మృతులిద్దరూ కొంతకాలం క్రితం ప్రేమించుకున్నారు. అయితే, యువతి తల్లిదండ్రులు వారి ప్రేమకు అడ్డు చెప్పడంతో ఆదర్శకు దూరంగా ఆమె ఉంటూ వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని కొల్లంకు చెందిన ఆదర్శ్... పలువురమార్లు ఆమెను బెదిరించాడు. అయితే, ఆ యువతి తన ప్రేమను నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు అశ్విన్ అనే విద్యార్థి చెప్పుకొచ్చాడు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పరాయి పురుషుడితో మాట్లాడిందని... భార్య చెవులు కోసిన భర్త

ఆప్ఘనిస్థాన్‌లో దారుణం జరిగింది. భార్య పరాయి పురుషుడితో మాట్లాడిందన్న అక్కసుతో ఆమె రెండు ...

news

మాంసం కొంటున్నారా? కనీస శుభ్రత పాటించట్లేదు.. జరజాగ్రత్త..

మాంసం కొంటున్నారా? అయితే జాగ్రత్త పడండి. మాంసం అమ్మకాల్లో చాలామంది నిబంధనలకు విరుద్ధంగా ...

news

హిజ్రాలకు ప్రత్యేక టాయిలెట్లు.. మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్

పురుషులకు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నట్లు హిజ్రాలకు టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంతో ...

news

ప్రేమకు నో చెప్పారని.. కళాశాలలో నిప్పంటించుకున్న ప్రేమ జంట.. 70శాతం?

ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరలం చెప్పారనే మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి ...

Widgets Magazine