గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (11:43 IST)

మహారాష్ట్రలో బీజేపీకి మద్దతివ్వడాన్ని తప్పుబట్టిన కేరళ ఎన్సీపీ!

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీకి భేషరతు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమంటూ ఎన్.సి.పి అధినేత శరద్ పవార్ చేసిన ప్రకటనపై ఎన్సీపీ కేరళ శాఖ మండిపడుతోంది. బీజేపీకి మద్దతివ్వడమనేది పార్టీ సిద్ధాంతాలకు విరుద్దమని, అవకాశవాదం అవుతుందని తెలిపింది. 
 
ఈ మేరకు కేరళ ఎన్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఏకే శశీంద్రన్ విలేకరులకు విషయం వెల్లడించారు. తమ అభిప్రాయాన్ని ఎన్సీపీ కేంద్ర ముఖ్య నేతలకు కూడా తెలిపానన్నారు. రాష్ట్ర విభాగాలను సంప్రదించకుండా ఇలా కేంద్ర నాయకత్వం ఏకపక్ష ప్రకటన చేయడం సరికాదని తెలిపారు. 
 
కాగా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్సీపీ 41 సీట్లతో నాలుగో స్థానంలో నిలువగా, బీజేపీ 123 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వ ఏర్పాట్లలో నిమగ్నమైవున్న విషయం తెల్సిందే.