గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (16:48 IST)

ఓ ఆవును సంహరించడం అంటే.. హిందూ అమ్మాయిని రేప్ చేసినట్టే!

భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు గోవుల తరలింపును అడ్డుకోవాలని ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అంతేగాకుండా కేంద్రంలో బీజేపీ పగ్గాలు చేపట్టాక గోసంరక్షణ అత్యంత ప్రధానాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం పశ్చిమ బెంగాల్ విభాగం ప్రతినిధి జిష్ణు బసు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక ఆవును సంహరించడమంటే... ఓ హిందూ బాలికను రేప్ చేయడంతో సమానమని, లేదా.. ఓ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసినట్లవుతుందని పేర్కొన్నారు. 
 
ఇకపోతే.. భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు గోవుల తరలింపును అడ్డుకోవాలని, భద్రతా బలగాలను, అధికారులకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అటు, దూడలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మహ్మద్ తరఫ్దార్ అనే వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అతడేమంటున్నాడంటే... "పశు మాంసం తినేందుకు, అమ్మేందుకు నా మతం అనుమతిస్తుంది. మరి, హిందువులకు సమస్య ఏంటి?" అని ప్రశ్నించాడు.