గర్భంతో వున్నాను.. లైంగికంగా కలవకూడదని భార్య వారించినా..

Last Updated: గురువారం, 6 డిశెంబరు 2018 (18:25 IST)
గర్భంతో వున్నాను.. లైంగికంగా కలవకూడదని భార్య వారించినా.. ఆమె భర్త మాత్రం లైంగిక కోరిక తీర్చమంటూ నిత్యం వేధించడంతో ఆ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కోల్‌కతా, సింతి ప్రాంతానికి చెందిన ఓ వివాహిత ప్రస్తుతం గర్భవతిగా వుంది. ఈ సమయంలో లైంగికంగా కలవకూడదని డాక్టర్ చెప్పడంతో ఆమె భర్తకు దూరంగా వుంటోంది. 
 
కానీ ఆమె భర్త మాత్రం లైంగిక కోరిక తీర్చమని నిత్యం వేధించేవాడు. తాజాగా ఆమెపై దాడి చేసి మరీ తన లైంగిక కోరిక తీర్చుకున్నాడు. దీంతో బాధిత మహిళ ఏకంగా కోర్టును ఆశ్రయించింది. తనపట్ల భర్త దారుణంగా ప్రవర్తించడాన్ని ఖండిస్తూ.. కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాల్సిందిగా పేర్కొంది.దీనిపై మరింత చదవండి :