శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (15:37 IST)

చెన్నైకు వచ్చిన లండన్ వైద్యుడు.. అమ్మ కోసం ఖుష్బూ అపోలో ఆస్పత్రికి...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్సలు అందించేందుకు లండన్ వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుడు గిల్సాని మళ్లీ చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వచ్చారు. వీరితో పాటు సింగపూర్‌కు చెం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్సలు అందించేందుకు లండన్ వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుడు గిల్సాని మళ్లీ చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వచ్చారు. వీరితో పాటు సింగపూర్‌కు చెందిన వైద్యులు అమ్మకు వివిధ రకాల వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అనారోగ్యంతో గత నెల 22వ తేదీన జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. 
 
సింగపూర్‌కు చెందిన మహిళా వైద్యులు గత వారం రోజుల నుంచి జయలలితకు ఫిజియోథెరఫీ చికిత్సలు చేశారు. ఆ చికిత్సకు జయలలిత స్పందించారు. జయలలిత స్పందిస్తున్న తీరును అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా వైద్యులు కూడా చికిత్స చేస్తున్నారు. దీంతో జయ ఆరోగ్యం మరింత కుదటపడిందని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. 
 
ఇదిలావుంటే.. అమ్మను కోలీవుడ్ నటి ఖుష్బూ కలిశారు. అపోలో ఆసుపత్రికి వెళ్లి జయలలితను చూసి వచ్చినట్లు ఖుష్బూ ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి బావుందని, మరింత త్వరగా ఆమె కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ దీపావళిని జయలలిత తమిళనాడు ప్రజలతో జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు ఖుష్బూ ట్వీట్‌ చేశారు.